కదిరిలో జనం భుజాలపైకి ఎక్కి మీసం మెలేసి, తొడకొట్టిన సీఐ!

Friday, September 20, 2024

వైఎస్ జగన్ పాలనలో పోలీసుల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుంది. అధికార పక్షం నేతల మెప్పు పొందేందుకు తమ విద్యుక్తధర్మాలను మరచిపోయి, అసాంఘిక శక్తుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తపైన తమ ప్రతాపం చూపుతున్నారు. చివరకు మహిళలపట్ల సహితం అసభ్యంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో అర్బన్ సిఐ మధు రెచ్చిపోయి తెలుగు మహిళలపై పాశవికంగా వ్యవహరించిన తీరు వెలుగులోకి వచ్చింది.  దేవళం బజారులో ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో కదిరి రెచ్చిపోయి మహిళలను అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడాడు. అమాయకులను చితకబాదాడు. అధికారం చేతిలో ఉందని రెచ్చిపోయాడు.

ఓ సందర్భంలో కొందరు వ్యక్తులు సీఐను భుజాలపైకి ఎత్తుకోగా.. ఆయన మీసం మెలేసి, తొడకొడుతూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. మీసం  మెలేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం పట్ల టీడీపీ మండిపడింది.

సీఐ మధు తీరు పట్ల స్థానికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే నెటిజన్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కదిరి మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్‌ సుధారాణి ఇంటి ముందున్న దుకాణం రేకులను అధికారులు తొలగించేందుకు వెళ్లారు.

దీంతో ఆమె తాము స్వచ్ఛందంగా తీసేస్తామని, అయితే అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను కూడా తొలగించాలని సూచించారు. దీంతో సీఐ రెచ్చిపోయారు. ‘‘మాతో మాట్లాడే స్థాయా నీది..?’’ అంటూ బూతులు తిట్టారు.

దీంతో ఆగ్రహించిన తెలుగు మహిళలు శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఎన్జీవో కాలనీలో ఉన్న సీఐ మధు ఇంటి వద్ద ధర్నా చేయడానికి వెళ్లారు. టీడీపీ మైనారిటీ నాయకురాలు ఫర్వీన్‌బానుతోపాటు వందమందికి పైగా మహిళలు అక్కడి వెళ్లారు.

వారిని చూడగానే సీఐ మధు విచక్షణా రహితంగా లాఠీ చార్జి చేశారు. ఫర్వీన్‌బానును, ఆమె కుమారుడు రోషన్‌, తెలుగు మహిళలను చితకబాదారు. దీంతో మహిళలు భయంతో పరుగులు తీశారు. దీంతో కందికుంట వెంకటప్రసాద్‌ ఎన్జీవో కాలనీవద్దకు వచ్చారు. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి.

లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్స సందర్భంగా.. ఆలయం చుట్టు పక్కల ఉన్న షాపుల తొలగింపు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. అకస్మా్త్తుగా తమ దుకాణాలను తొలగిస్తే ఉపాధి కోల్పోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ వారికి అండగా నిలిచారు.

పూర్తిగా అడ్డం ఉన్న షాపులను మాత్రమే తొలగించాలని కోరారు. కానీ ఆలయాధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సీఐ మధు అక్కడికి చేరుకొని టీడీపీ వర్గీయులను అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, సీఐ మధ్య మాటా మాటా పెరిగింది. చెన్నై జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

కదిరి సీఐ మధు తీరు ఫై టీడీపీ శ్రేణులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  మధు ను సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీఐ తీరు గుండాలు వ్యవహరించినట్టు ఉందని ఆరోపించారు. కదిరి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా బలగాల మోహరించాయి. కదిరి ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు పరామర్శించారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles