ఓ ఐపీఎస్ అధికారి నివేదికతో పదవి కోల్పోయిన బండి సంజయ్

Thursday, December 19, 2024

అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ ను మార్చేందుకు బీజేపీ అధిష్టానంతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు సహితం తీవ్రంగా వ్యతిరేకించారని తెలిసింది. సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి మార్చని పక్షంలో తాము పార్టీలో కొనసాగలేమని ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంటి వారు స్పష్టం చేసినా బిజెపి అగ్రనాయకత్వం బెదరలేదని చెబుతున్నారు.

అందుకనే తన పదవి మార్పు గురించి వస్తున్న కథనాలను సంజయ్ కొట్టిపారవేస్తూ వస్తున్నారు. నేరుగా ప్రధాని మోదీ, అమిత్ షాల అండదండలు ఉంటూ ఉండడంతో తన పదవికి ఢోకాలేదని ధీమాతో వ్యవహరిస్తూ వచ్చారు. ఈ ప్రక్రియలో తనపై వస్తున్న ఆరోపణల గురించి దిద్దుబాటు చర్యలు చేపట్టే ప్రయత్నం చేయలేదు. కనీసం తనను వ్యతిరేకిస్తున్న నాయకులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసుకోలేదు.

ఈ లోగా తెలంగాణకు చెందిన ఒక ఐపీఎస్ అధికారి సంజయ్ వ్యవహారాల గురించి అందించిన నివేదికతో కేంద్ర ప్రభుత్వం నివ్వెరపోయిన్నట్లు తెలుస్తోంది. సంజయ్ ను కొనసాగిస్తే ఎన్నికల సమయంలో కేవలం తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో పార్టీ ఆత్మరక్షణలో పడే ప్రమాదం ఉందని గ్రహించింది. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను పట్టించుకోకపోవడంతో రాజకీయంగా `భారీ మూల్యం’ చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఆ ఐపీఎస్ అధికారి అధికార పర్యటనగానే ఢిల్లీ వెళ్లి, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలోని కీలక అధికారులను కలిసి సంజయ్ కు సంబంధించిన కీలక అసమాచారం అందించినట్లు చెబుతున్నారు. బిజెపియేతర పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంకు చెందిన ఓ ఐపీఎస్ అధికారికి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులు ఇంటర్వ్యూ ఇవ్వడం, రెండున్నర గంటలకు పైగా ఆ అధికారి చెప్పిన విషయాలను ఆలకించడం చాలా అరుదైన సంఘటనగా అధికార వర్గాలు భావిస్తున్నాయి.

నిజాయతిపరుడిగా, సమర్ధవంతమైన అధికారిగా ఉన్నతాధికారులతో ఆ అధికారి పట్ల ఉన్న సానుకూల అభిప్రాయంతోనే ఆయన ఇచ్చిన నివేదికను సీరియస్ గా తీసుకొని హోమ్ మంత్రి అమిత్ షా కు నివేదించారని చెబుతున్నారు.  అందులో పాదయాత్ర పేరుతో వందల కోట్ల రూపాయల నిధులను బెదిరించి వసూలు చేశారని, అనేకమందికి వచ్చే ఎన్నికల్లో పార్టీ సీట్లు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేసాడని, పార్టీలో కొత్తగా చేరే వారి వద్ద నుండి కూడా డబ్బు వసూలు చేసాడని అంటూ తెలియచేశారని తెలుస్తున్నది.

పైగా, కొందరు బీజేపీ మహిళా నాయకులను లైంగిక వేధింపులకు గురిచేసిన్నట్లు నేరుగా ప్రధాని మోదీ దృష్టికి వచ్చిన్నట్లు చెబుతున్నారు. కరీంనగర్ ప్రాంతంలో కొందరు అధికార పార్టీ నేతలతో లాలూచీపడి ఐటీ, ఈడీ దాడులకు గురైన గనుల మాఫియా నుండి కూడా భారీగా ఆనిధులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు అన్ని తెలంగాణాలో బిజెపి వర్గాలలో చాలామంది అంతర్గతంగా ప్రస్తావించుకొంటున్న అంశాలే అయినప్పటికీ పార్టీ అగ్రనాయకత్వంకు అధికారికంగా చేరడంతో వారు ఖంగు తిన్నట్లు సమాచారం.

ఈ ఆరోపణలకు తోడుగా బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అందించిన నివేదిక సహితం పార్టీ అగ్రనాయకత్వాన్ని అప్రమత్తం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణాలో పార్టీ నేతలు చాలా వరకు మీడియా ప్రదర్శనలకు పరిమితం అవుతున్నారని, క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని అంటూ సవివరమైన నివేదిక ఇచ్చారు.  ఆ నివేదిక చూసిన అమిత్ షా “మీరు రెండంకెల ఎమ్మెల్యే సీట్లు కూడా గెల్చుకోలేరు.. అధికారంలోకి ఎట్లా వస్తారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

వీటన్నింటికి మించి పాదయాత్ర పేరుతో సంజయ్ వసూలు చేసిన భారీ నిధులను పార్టీకి జమ చేయమని ఆదేశించాలని కూడా సునీల్ బన్సల్ పార్టీ అగ్రనాయకత్వంకు సూచించారు. సంజయ్ సాగించిన దందాలకు రాష్ట్ర బిజెపి ఇన్ ఛార్జ్ గా ఉన్న మరో ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ కూడా సహకరించినట్లు ఆరోపణలు చెలరేగాయి. అందుకనే ఆయనను ఎన్నికల ఇన్ ఛార్జ్ గా నియమించకుండా మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను నియమించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles