ఏపీలో వాలంటీర్ల నకిలీ నోట్ల పంపిణీ వెనుక వైసీపీ నేతలు!

Wednesday, December 18, 2024

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో  గ్రామ వలంటీరు పింఛను డబ్బుల్లో దొంగనోట్లు కలిపి పంపిణీ చేసి పట్టుబడటం రాజకీయంగా కలకలం రేపుతున్నది. లబ్ధిదారులు తమకు  నోట్లు నకిలీవి అని ఓ దుకాణంలో బయటపడటంతో గత ఆదివారం అల్లరయింది. దానితో అధికారులు, పోలీసులు విధిలేక కేసు నమోదు చేశారు.

వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చే నగదులో దొంగ నోట్లు ఎవరు కలిపారన్నది నిగ్గు తేలాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు చెలరేగుతున్నాయి. సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం., వాలంటీర్ తానే ఆ తప్పు చేశానని అంగీకరించడంతో కేసును మూసి వేసే ప్రయత్నం జరుగుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

అసలు దొంగ నోట్లు పంపిణీ చేసింది ఎవరు?, దీని వెనక ఏదైనా ముఠా ప్రమేయం ఉందా? అనే ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం… దొంగ నోట్ల పంపిణీలో ఆంధ్ర ప్రదేశం రాష్ట్రం దేశంలోనే మూడవ స్థానంలో ఉన్నట్టు వెల్లడైనది. అంటే, ఉన్నతస్థాయిలలో ఉన్న వ్యక్తుల ప్రమేయం లేకుండా ఈ విధంగా ప్రభుత్వం తరపున జరిగే నగదు పంపిణీలో   దొంగల నోట్లు ప్రత్యక్షమయ్యే అవకాశం ఉండదు.

ఈ విధంగా పెన్షన్ గా ఇచ్చే నగదుతో దొంగనోట్లు ప్రత్యక్షం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమకు పంపిణి చేస్తున్న డబ్బు ఎలాంటిదో అని అనుమానంగా చూస్తున్నారు. ఉన్నత రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం పెన్షన్ లలో దొంగనోట్ల పంపిణి సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

అసలు ఇప్పడు ప్రభుత్వ కార్యకలాపాలలో జరిగే నగదు పంపిణీని నేరుగా బ్యాంకు అకౌంట్ లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా బదిలీ చేస్తున్నాయి. కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పింఛన్ లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్ ద్వారా డబ్బులను పంపిణీ చేయకుండా, నేరుగా నగదు పంపిణీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందనే ఆరోపణలు తలెత్తుతున్నాయి.

ప్రతి నెల రూ. 1800 కోట్ల నగదును బ్యాంకు నుంచి డ్రా చేసి వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలోని పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఐదు శాతం దొంగ నోట్లు కలిపినా పంపిణీ చేసిన రూ. 80 కోట్ల దొంగ నోట్లు మార్కెట్ చలామణిలోకి వెళ్ళీ అవకాశం ఉంది. అందుకనే, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు చేబడితే గాని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదు.

ఇలా ఉండగా, వాలంటీర్ వ్యవస్థను స్వచ్ఛంద సేవా వ్యవస్థగా ప్రభుత్వం పేర్కొంటున్నది. దానితో పింఛన్ల పంపిణీ బాధ్యతను వాలంటీర్లకు కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ఏమైనా అవకతవకలు జరిగితే వారిని ఎక్కడ కూడా బాధ్యులను చేయలేదు. కానీ వాలంటీర్లకు ఐడి కార్డులను జారీ చేసింది. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా?, కాదా?? అన్నదానిపై స్పష్టత లేదు. ఒకవేళ వాలంటీర్ స్వచ్ఛంద సేవకుడైతే, అతనికి ప్రభుత్వ ఖాతా నుంచి జీతం ఎందుకు ఇస్తున్నారు?. అనే ప్రశ్న తలెత్తుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles