ఎస్పీలపై వేటు పడినా.. ఖాకీల తీరు మారడం లేదు.. 

Tuesday, April 30, 2024

“మీ జిల్లాల్లో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పుతోంటే మీరు ఏం చేస్తున్నారు? దాడులు జరిగే పరిస్థితి ఉందని తెలిసినా కూడా అరికట్టలేక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉద్రిక్తతలను ముందుగా గమనించలేరా?” ఇవన్నీ కూడా.. ఇటీవల జిల్లాల ఎస్పీలుగా ఎన్నికల సంఘం వేటుకు గురైన ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా అడిగిన ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు గనుకనే ఆరుగురు ఐపీఎస్ లపై వేటు పడింది. వారందరూ ఎన్నికల విధులకు దూరం అయ్యారు. కొత్త ఐపీఎస్ లు ఎస్పీ లుగా వచ్చారు. కానీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. కళ్యాణదుర్గం నియోజక వర్గంలో తెలుగుదేశం నాయకులపై విచక్షణ రహితంగా జరిగిన దాడి ఇందుకు నిదర్శనం. 

కళ్యాణదుర్గం లో టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించడంలో భాగంగా వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ఇల్లు ఉన్న వీధిలో వెళ్ళారు. వైసీపీ నేతలు దారికి అడ్డంగా వాహనాలు పెట్టారు. వాటిని తీయమని అడిగినందుకు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రమేష్ బాబుపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలు అయ్యాయి. 

రెండు పార్టీల నాయకులు తారసపడే అవకాశం ఉన్నదని తెలిసినప్పుడు ఉద్రిక్తతలు నివారించడానికి పోలీసులు సిద్ధంగా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. నాయకుల ప్రచారం వెంట పోలీసులు ఉండాలి. వారి ప్రచారం షెడ్యూలు ముందే చెబుతారు గనుక తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అవేమీ చేయకపోతే అది పోలీసుల నిర్లక్ష్యమే అనుకోవాలి. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే పోలీసులు మరింత చిత్తశుద్ధితో పనిచేసేలా ఈసీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles