ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి `సుప్రీం’లో చుక్కెదురు

Saturday, January 18, 2025

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టులో సీబీఐకి చుక్కెదురైంది. ఈ కేసులో యథాతథ స్థితిని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దానితో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పాక్షిక ఊరట దొరికింది.

తదుపరి విచారణ తేదీ వరకు స్టేటస్‌కో కొనసాగుతుందని జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరీశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఎలాంటి పేపర్లు, డాక్యుమెంట్స్ సీబీఐకి ఇవ్వొద్దని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఇప్పుడు విచారణ కొనసాగించవద్దని స్పష్టం చేస్తూ విషయం తమ వద్ద ఉన్నప్పుడు విచారణ కొనసాగించవద్దన్న సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. లేకుంటే తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని హెచ్చరించింది.

సుప్రీంకోర్టుకు వేసవి సెలవుల తర్వాత విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది. జులై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో మిస్ లేనియస్ పిటిషన్ కింద విచారణ జరుపుతామని పేర్కొంది. అప్పటివరకు యధాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధానంగా రెండు విషయాలపై విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. కేసు మెరిట్స్, హైకోర్టులోనే అప్పీల్‌కు వెళ్లడం.. ఈ రెండు అంశాలపై వాదనలు వింటామని తెలిపింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఫిబ్రవరి 8న ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిబిఐ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో చాలా అంశాలపై విచారణ జరగాల్సి ఉందని, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పెద్దలపై ఆధారాలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను కూల్చిన ఉదంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకోడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని ఈ దశలో సిబిఐ, ఈడీ దర్యాప్తులో జోక్యం చేసుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎవరెవరి పాత్ర ఏమిటో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వ వాదనలకు సిబిఐ అభ్యంతరం తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తెలంగాణ కోరినట్లు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకపోయినా స్టేటస్ కో జారీ చేసింది. .తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తుపై స్టేటస్ కో ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో ప్రభుత్వ వాదనల్లో ఏదైనా మెరిట్స్ ఉంటే హైకోర్టు ఉత్తర్వులను రివర్స్‌ చేస్తామని చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles