ఎన్ఆర్ఐ అభ్యర్థులకు చంద్రబాబు చెక్!

Thursday, December 19, 2024

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజాసేవ అంటూ వివిధ ఫౌండషన్ల పేరుతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను జరుపుతూ, రాజకీయ పార్టీల అధినేతలను ఆకట్టుకొంటూ పార్టీ సీట్ ల కోసం ప్రయత్నం చేయడం, ఎన్నికలలో బాగా డబ్బు ఖర్చుపెట్టి ఎట్లాగైనా గెలుస్తానని భరోసా ఇస్తుండటం నేను రాజకీయాలలో సర్వసాధారణంగా మారిపోయింది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఈ విషయమై పలు సమస్యలను ఎదుర్కొంటున్నది. నాలుగేళ్లుగా అధికార పక్షం వేధింపులకు తట్టుకొని, పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్న పార్టీ సీనియర్ నేతలను పక్కన పెట్టె విధంగా ఆ విధంగా ప్రజా జీవనంలోకి వస్తున్న ఎన్ఆర్ఐ లు పావులు కదుపుతూ ఉండడంతో టిడిపిలో కుమ్ములాటలకు దారితీస్తుంది.

యువతకు అవకాశం పేరుతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అటువంటి వారికి ప్రోత్సాహం ఇస్తుంటే, మరొకొన్ని చోట్ల స్థానిక టిడిపి నేతకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీలోని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. తన నియోజకవర్గంలో ఆ విధంగా ఒక ఎన్ఆర్ఐ సేవా కార్యక్రమాలు అంటూ డబ్బు ఖర్చు పెడుతూ ఉండడంపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ విధంగా పుల్లారావు బహిరంగంగా వాఖ్యలు చేయడం పట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొదట్లో అసహనం వ్యక్తం చేస్తూ, ఇటువంటి ప్రకటనలు సహింపనని హెచ్చరించినా, నెమ్మదిగా ఇటువంటి సమస్యలపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. దానితో ఆ విధంగా సీట్ కోసం ప్రయత్నిస్తున్న ఎన్ఆర్ఐ లకు సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ విధంగా పార్టీ అధినేత స్పష్టం చేయడంతో టిడిపి సీటు కోసం నియోజకవర్గాలలో తిరుగుతున్న పలువురు ఎన్ఆర్ఐ లు ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. ఇదివరకటి మాదిరిగా వారి ఫౌండేషన్లతో సేవా కార్యక్రమాలు జరపడం లేదు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్ఆర్ఎ నేతలకు స్థానికంగా ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకున్న నేతలకు మధ్య తీవ్రమవుతున్న విభేధాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ఈ విధంగా దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.  శృంగవరపు కోట నుంచి మొదలు పెడితే చిలకలూరిపేట వరకూ ఎన్ఆర్ఐ నేతలు హడావుడి చేస్తూ టిక్కెట్ల కోసం ప్రయత్నాలు పార్టీనే నమ్ముకున్న సీనియర్లలో తీవ్ర ఆగ్రహాన్ని గురిచేశాయి. 

శృంగవరపు కోటలో ఎన్ఆర్ఐ నేత గొంపా కృష్ణ, మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలితా కుమారి మధ్య విభేధాలు పొడచూపాయి.  గుడివాడలో మరో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో పార్టీ కోసం పని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఈ సారి టిక్కెట్ ను ఆశిస్తున్నారు. ఈ ఇద్దరి నేతల మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది.

చిలకలూరి పేటలో కూడా ఇదే తరహాలో ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తోంది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో భాష్యం ట్రస్ట్ పేరిట ఎన్ఆర్ఐ భాష్యం ప్రవీణ్ వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.  గుంటూరు వెస్ట్ టిక్కెట్ కోసం మరో ఎన్ఆర్ఐ ప్రయత్నిస్తున్నారు. అలాగే మరికొందరు ఎన్ఆర్ఐలు కూడా వివిధ నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు పేరిట హడావుడి చేయడం రగడకు దారితీసింది. ప్రస్తుతానికి ఇటువంటి రగడకు టిడిపి అధినేత ముగింపు పలికిన్నట్లయినది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles