ఎంపీ గీతను వెంటాడుతున్న ఆస్తుల పంపకం వివాదం

Thursday, December 26, 2024

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎన్టీ రామారావు ఆశీస్సులతో చిన్నవయసులోనే జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి చేపట్టి అప్పటి నుండి పార్టీలు మారినా ఏదో ఒక పదవిలో ఉంటూ, ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత 2024 ఎన్నికలకు ముందు కుటుంభంలో ఆస్తుల పెంపకం వివాదంలో చిక్కుకోవడం కలకలం రేపుతుంది.

స్వయంగా ఆమె వదిన ఆస్తులు పంపకాలు కాకుండా మోసం చేసిందని, న్యాయం కోసం కోర్టుకు వెడితే చంపుతామని బెదిరిస్తున్నారని అంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం రాజకీయ దుమారం రేపింది. తన ఆడపడుచులు, వారి భర్తల నుండి కాపాడాలంటూ ఆమె వదిన పుప్పాల కళావతి కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లాకు గత సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

2006లో తన భర్త అయిన దివంగత కృష్ణకుమార్‌ చే బలవంతంగా ఆస్తులను రాయించుకున్నారని, తాను, తన పిల్లలు కోర్టులో న్యాయపోరాటం చేస్తుంటే తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌న భ‌ర్త 2010లో చ‌నిపోయేనాటికి త‌మకు రావాల్సిన ఆస్తిని ఇస్తామ‌న్న‌వారు, త‌మ భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత ఏకాకిగా వ‌దిలేసార‌ని ఆమె క‌లెక్ట‌ర్ ‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తెలిపింది.

పైగా,  ఆస్తుల వివాదం కోర్టులో ఉండగా ఎంపీ వంగా గీత, ఆమె సోదరి కుసుమ కుమారి, ఆమె భర్త లు కలిసి ఆస్తి కోసం తనను, తన పిల్లలను బెదిరిస్తున్నారని కళావతి తన ఫిర్యాదులో అనే ఆరోపించారు.  అయితే ఈ ఫిర్యాదు విషయంలో జిల్లా కలెక్టర్ చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చు. పోలీసుల ద్వారానో లేదా కోర్టు ద్వారానో తేల్చుకోవాల్సిన అంశం.

అయితే, ఎన్నికల ముందు రాజకీయ దుమారం లేయడం పట్ల వంగా గీత ఇరకాట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆమె ఇప్పటివరకు ఈ ఫిర్యాదుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న తర్వాత ఆమెను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యసభకు కూడా పంపారు.

అయితే, 2004లో టీడీపీ అధికారం కోల్పోవడంతో తర్వాత చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తిరిగి టిడిపి అధికారంలోకి రావడంతో కొంతకాలం మౌనంగా ఉన్న ఆమె 2019 ఎన్నికలకు రెండు వారాల ముందు వైసిపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు.

1983లో రాజకీయ అరంగేట్రం చేసిన వంగా గీత తొలుత శిశు సంక్షేమ రీజనల్‌ ఛైర్‌పర్సన్‌గా నామినేటెడ్‌ పదవిని పొందారు. గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలలో మధ్యలో ఏడెనిమిదేళ్లు మినహా ఏదో ఒక అధికార పదవిలో ఉంటూ వస్తున్న ఆమెకు ఇప్పుడు మంత్రి పదవిపై దృష్టి పదిన్నట్లున్నది.

అందుకనే, వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్యెల్యేగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తిరిగి వైసిపి ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాను.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేద్దాం అనుకొంటున్న నియోజకవర్గాలలో పిఠాపురం పేరు కూడా వినిపిస్తుండటం గమనార్హం. ఇటువంటి సమయంలో ఆస్తుల పెంపకం వివాదంపై సొంత వదిన తీవ్రమైన ఆరోపణలతో బయటపడటంతో ఆమె ఒక విధంగా ఆత్మరక్షణలో పడినట్లయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles