`ఉచిత పధకాలు’పై పవన్ కళ్యాణ్ తికమక

Wednesday, January 22, 2025

2019 ఎన్నికల్లో పోటీ చేసి పరాభవాన్ని మూటగట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో మాత్రం తన పార్టీని అధికారం వైపు తీసుకెళ్లడం కోసం పట్టుదలతో ఉన్నట్లు గత వారం రోజులుగా `వారాహి విజయ యాత్ర’ సందర్భంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. తనను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా ఈ సారి ఎవ్వరు అడ్డుకోలేరని శపధం చేస్తూ యాత్ర ప్రారంభించిన ఆయన `నన్ను ముఖ్యమంత్రిగా చేస్తే.. ‘ అంటూ ప్రసంగాలు ఇస్తున్నారు.

తనపై వైసీపీ మంత్రులు, నేతలు నిత్యం చేస్తున్న విమర్శలు, బెదిరింపులను ప్రస్తావిస్తూ తమ ఓటమి ఖరారు కావడంతో అసహనంతో అంటున్న మాటలుగా కొట్టిపారేస్తున్నారు.  ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించబోతుందనే భరోసా ప్రతి సమావేశంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన చెబుతున్న మాటలలో కొంత గందరగోళం వ్యక్తం అవుతుంది.

ఉదాహరణకు మొన్నటి వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నగదు బదిలీ ద్వారా`బటన్ నొక్కుడు’ మాత్రమే చేస్తుందని విమర్శిస్తున్న టిడిపి ఇప్పుడు తాము అంతకంటే ఎక్కువగా నగదును అందిస్తామంటూ పలు పధకాలను ప్రకటించింది. అయితే `ఉచితంగా డబ్బు’ ఇవ్వడం మంచిది కాదంటూ బుధవారం ముమ్మిడివరం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇప్పటివరకు సీఎం జగన్ `ఉచితాల’ పధకాలను విమర్శిస్తూ, తాము అధికారంలో వచ్చినా అటువంటి పథకాలే అమలు చేస్తామనడం పట్ల కొంతమేరకు అసహనం వ్యక్తం చేశారు.  కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన వీర మహిళలతో భేటీ అయిన పవన్ ఉచితాలు బదులు ఉపాధి కల్పించే మార్గాలు చూపిస్తే రాష్ట్రం అప్పులు పాలు కాదని చెప్పారు.

దీంతో వీర మహిళలు కూడా అమ్మఒడి డబ్బులు తల్లుల ఖాతాల్లో వేస్తే పిల్లలకు నాణ్యమైన చదువు రాదని, నిపుణులైన ఉపాధ్యాయులను నియమిస్తే పిల్లలకు మంచి చదువు వస్తుందని తమ మనసులో మాట చెప్పారు. దీంతో పవన్ జనసేన ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతానుసారం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పవన్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే సంక్షేమంపై వైసీపీ, టీడీపీ కంటే భిన్నంగా ఆయన ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా వీర మహిళల భేటీలో పవన్ వ్యాఖ్యల బట్టి చూస్తే ఉచిత పథకాల కంటే ఉపాధి కల్పించే పథకాలపై జనసేన దృష్టిసారించే అవకాశం ఉందనే సంకేతం ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో సంక్షేమానికి అలవాటు పడ్డ జనాన్ని గుర్తించే

అయితే, ఆ వెంటనే కొద్దిసేపటికి ముమ్మిడివరంలోనే జరిగిన బహిరంగసభలో యువతకు పెట్టుబడి కింద ఉచితంగా రూ. 10 లక్షలు ఇస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెబుతూ ఈ ప్రకటన చేయడంతో అక్కడున్నవారు నివ్వెరపోయారు. ఇప్పుడే గదా ఉచితాల పట్ల వైరాగ్యం ప్రకటించారు గదా! అనుకున్నారు.  ఎప్పటికపుడు వేదిక, శ్రోతలను బట్టి మాట్లాడటమే గాని రాజకీయ అంశాలపై ఆయనలో స్పష్టత కొరవడిందా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles