ఉగ్రవాదుల అడ్డాగా పాత బస్తీ…  మజ్లిస్​ పార్టీ ఆశ్రయం!

Thursday, December 19, 2024

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయం నుండి హైదరాబాద్ నగరం, ముఖ్యంగా పాతబస్తి ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడి జరిగినా, ఎక్కడా ఉగ్రవాదులు పట్టుబడినా ఏదో ఒక విధంగా హైదరాబాద్ తో సంబంధం ఉంటూ వస్తున్నది. ఈ నగరాన్ని `షెల్టర్ జోన్’గా వారు ఉపయోగించుకొంటున్నట్లు పలు సందర్భాలలో స్పష్టం అయింది.

ఇతర రాష్ట్రాల పోలీసుల్లో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలో ఇతర రాష్ట్రాలలో అరెస్ట్ అయినవారి నుండి లభించిన సమాచారంతో ఇక్కడకు వచ్చి అరెస్టులు చేయడం గాని, తెలంగాణ పొలిసు వారి కదలికలపై గట్టిగా నిఘా ఉంచడంలేదని పలు సందర్భాలలో కేంద్ర నిఘా సంస్థలు చివాట్లు పెట్టాయి. ముఖ్యంగా మజ్లిస్​ పార్టీ వారికి అండగా ఉంటున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. 

తాజాగా మధ్యప్రదేశ్ పోలీసుల ప్రమేయంతో నగరంలో అరెస్ట్ అయిన వారిలో సలీం అనే వ్యక్తి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సారధ్యంలో నడుస్తున్న డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పని చేస్తున్నట్లు తేలడంతో నిఘా సంస్థలు నివ్వెర పోతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు స్థానికంగా రాజకీయనేతల అండదండలు లభిస్తున్నట్లు వెల్లడైనట్లయింది.

గత ఆగష్టు లో బిజెపి నుండి సస్పెండ్ అయిన ఎమ్యెల్యే రాజాసింగ్ తల నరకాలని అంటూ రెండు రోజులపాటు రాత్రి సమయాలలో పాతబస్తీలో నిరసనలు చేపట్టిన ఇస్లామిస్టులు 90 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రాజాసింగ్ ను అరెస్ట్ చేయగానే, పోలీసులు వదిలివేశారు. వారితో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ఫోన్ లో మాట్లాడుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది.

ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ నగరంలో ఉగ్రవాదుల కదలికలపై, వారి స్థావరాలపై ఒక్కసారి కూడా సమీక్ష జరిపిన దాఖలాలు లేవు. హైదరాబాద్​ సిటీని టెర్రరిస్టులకు షెల్టర్​ జోన్​గా మార్చారని సంజయ్ ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసం, అధికారం కోసం మజ్లిస్​తో బీఆర్ఎస్, కాంగ్రెస్  అంటకాగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.

‘‘హిజ్బు ఉత్ తహరీర్ (హెచ్‌‌‌‌యూటీ) సంస్థ ఉగ్రవాదులను రెండ్రోజుల కింద హైదరాబాద్​లో పట్టుకున్నారు. ఈ సంస్థ ఐసిస్ కన్నా ప్రమాదకరమైంది. జీవ, రసాయన ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం సృష్టిస్తుంది.  హెచ్​యూటీ టెర్రరిస్టులు అనంతగిరి కొండలను శిక్షణా కేంద్రంగా చేసుకున్నరు. డ్రోన్ ద్వారా ఆపరేట్ చేస్తున్నరు” అంటూ సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

రోహింగ్యాలకు ఓల్డ్ సిటీ షెల్టర్ జోన్ గా మారిందని తాము అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నామని గుర్తు చేస్తూ ఇప్పుడది నిజమైందని చెప్పారు.  ‘‘ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మను 52 సార్లు పొడిచిన ఉగ్రవాదికి హైదరాబాద్​లో షెల్టర్ ఇచ్చారు. పీఎఫ్ఐకి షెల్టర్ జోన్ ఎంఐఎం. రాజకీయాల కోసం ఉగ్రవాదులను మజ్లిస్​ పెంచి పోషిస్తుంటే… ఓ వర్గం ఓట్ల కోసం ఆ పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతిస్తున్నయ్​” అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

ఇన్నాళ్లూ లవ్ జిహాద్​ మాత్రమే అనుకున్నామని, ఇప్పుడు కొత్త రకం జిహాద్ నడుస్తున్నదని ​ వెల్లడించారు. ‘‘హిందూ యువకులను బెదిరించి ముస్లింలుగా మార్చి..వారిని టెర్రరిస్టులుగా తయారు చేసి హింసకు పాల్పడుతూ హిందువులు కూడా టెర్రరిస్టులే అనే ముద్ర వేయాలనే లక్ష్యంతో మజ్లిస్ ఉంది” అని ఆరోపించారు. తెలంగాణలో శాంతి భద్రతల సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా ఉగ్రవాద కార్యకలాపాలపై సీఎం సమీక్ష చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles