ఈటెల – రేవంత్ సవాళ్ళలో ఇరకాటంలో బిఆర్ఎస్

Sunday, December 22, 2024

మునుగోడు ఉప ఎన్నికలు ఎప్పుడో జరిగితే ఇప్పుడు దాదాపు ఆరు నెలల తర్వాత ఆ విషయం మీద ఆరోపణలు చేసుకుంటూ బిజెపి, కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధంకు తిడుతుంటే, అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు మాత్రం నిచేస్తులై దిక్కులు చూస్తూ ఉండిపోతున్నారు.

ఈ మాటల యుద్ధంలో ప్రధానమైన ఆరోపణ బీజేపీ అభ్యర్థిని ఎదుర్కోలేక, కాంగ్రెస్ అభ్యర్థిని సరిగ్గా ప్రచారం చేసుకోకుండా, పరోక్షంగా తమకు సహకరించమని బిఆర్ఎస్ నేతలు బేరమాడి, రూ 25 కోట్లు ఇచ్చారన్నది.

బీజేపీ నాయకులు అందరూ మూకుమ్మడిగా ఈ విషయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ రెండు ఒక్కటే అన్నట్లు మాట్లాడుతున్నారు. అయినా బిఆర్ఎస్ నేతలు నోరువిప్పడం లేదు.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తుంది. అయితే దానిని ద్విముఖ పోటీ చేయాలని బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే ఉండాలని బిజెపి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు.

త్రిముఖ పోరు ఉంటేనే తమకు కలిసొస్తుందని బిఆర్ఎస్ భావిస్తుంది. అందుకోసం, ఆ  రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాల్సిన చోట ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం వెనుక ఏదో మతలబు ఉన్నట్లు బిఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు.

వాదనలో గాని, మాటలలో గాని ఎప్పుడూ ఖచ్చితంగా వ్యవహరించి మాజీ ఈటల రాజేందర్ ఇతర నాయకుల మాదిరిగా ఎప్పుడో జరిగిన ఉపఎన్నికను ఆసరా చేసుకొని యధాలాపంగా ఇప్పుడు ఆరోపణ చేసేరకం కాదని అందరికన్నా ఎక్కువగా బిఆర్ఎస్ నేతలకే బాగా తెలుసు. అందుకనే ఈటెల ఇప్పుడు ఇటువంటి ఆరోపణ చేయడం వెనుక లోతయిన ఎత్తుగడ ఏదో ఉండి ఉండవచ్చని బిఆర్ఎస్ నేతలు కలవరం చెందుతున్నారు. 

తెలంగాణ రాజకీయాలలోకి బీఆర్ఎస్ పేరు రాకుండా బిజెపి, కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చి రాజకీయాల దిశను మార్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానం ఇప్పుడు ప్రధానంగా కలుగుతున్నది.  బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితులు మారితే, జనాలకు కూడా ఈ రెండు పార్టీల పైన దృష్టి పడుతుందని, అప్పుడు ఎక్కువగా నష్టపోయేది బిఆర్ఎస్ మాత్రమే అని భావిస్తున్నారు.

అందుకనే ఈటెల విమర్శకు రేవంత్ రెడ్డి ఎంతగా రెచ్చిపోయిన, భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ప్రమాణం అంటూ హడావుడి చేసినా, రాజేందర్ అదే రీతిలో రెచ్చిపోలేదు. చాలా ప్రశాంతంగా ఉండిపోయారు. మాటకు మాట బదులుగా చెప్పి తామిద్దరి మధ్య వ్యక్తిగత పోరుగా మారె అవకాశం ఇవ్వలేదు.

ఈ మొత్తం వ్యవహారంలో మునుగోడులో బిఆర్ఎస్ దొంగచాటుగా ఉపఎన్నికను గెల్చుకుండానే సందేశం జనానికి పంపే ప్రయత్నం చేసినట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles