అసెంబ్లీకి పోటీ చేసేందుకై తెలంగాణ ఎంపీల క్యూ!

Wednesday, December 25, 2024

ఈ సంవత్సరం చివరిలోగా జరునగున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇద్దరు, ముగ్గురు తప్పా మిగిలిన ఎంపీలందరూ, పార్టీలకు అతీతంగా సిద్దపడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలలోని కీలక నేతలు పార్లమెంట్ నుండి అసెంబ్లీలో ప్రవేశించడం కోసం ఆత్రుత చెందుతున్నారు.

పార్లమెంట్ కన్నా ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో, ఎన్నికలలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి పదవి లేదా కనీసం మంత్రి పదవి అన్న పొందవచ్చని భావిస్తున్నారు. అందుకనే ప్రష్టుతం ఎంపీలుగా ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలతో పాటు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహితం ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, పార్టీ నాయకత్వం తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

2018లో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంజయ్ లతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు తదుపరి లోక్ సభకు ఎన్నిక కావడం గమనార్హం. మరో బీజేపీ ఎంపీ డి అరవింద్ సహితం అసెంబ్లీకి పోటీకి సిద్దపడుతున్నారు.

సీఎం కేసీఆర్ సహితం తమ పార్టీకి చెందిన కనీసం ముగ్గురి ఎంపిలను అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్దపడమని సంకేతం ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలలో ఐదారు మంది కొత్తవారిని పోటీకి దింపి, వారిని జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణకు ఉపయోగించుకొనేందుకుకే కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తున్నది.

 పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సహితం  హుజూర్‌నగర్‌ నుండి బరిలో నిలవనున్నారని తెలుస్తున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి గెలిచిన ఉత్తమ్‌ ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఆదేశంతో నల్గొండ ఎంపీ బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ దఫా నల్గొండ లోక్‌సభ నుంచి పార్టీ సీనియర్‌ నేత మాజీ మంత్రి జానారెడ్డి పోటీచేసే అవకాశం ఉంది.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీకి దిగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వేములవాడ నుండి అసెంబ్లీకి పోటీచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఇక, నాగర్‌కర్నూలులో బిఆర్ఎస్ ఎంపీగా ఉన్న మాజీ మంత్రి పోతుగంటి రాములు అచ్చంపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజుని నాగర్‌ కర్నూలు లోక్‌సభకు పోటీకి పెట్టే అవకాశం ఉంది.

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్య ర్థిగా మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని పోటీకి పెట్టాలని అధినేత కేసీఆర్‌ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా,  మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నట్లు బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

 మహబూబా బాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత అదే నియోజక వర్గ ఎమ్మె ల్యేగా పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ భారాసకు రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో అక్కడ  ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ను పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles