నందమూరి బాలయ్య బాబు నటించిన తాజా సినిమా ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది.కాగా, ఈ సినిమాను నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.
అయితే, సంక్రాంతి బరిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘డాకు మహారాజ్’ చిత్ర నిర్మాతలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశారు. తాజాగా ఆయన నిర్మాత నాగవంశీకి ఓ బొకేని పంపి తన శుభాకాంక్షలు తెలిపారు. డాకు మహారాజ్ లాంటి సక్సెస్ఫుల్ సినిమాని తెరకెక్కించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఇక దీనికి సంబంధించిన నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో సమాధానం ఇచ్చారు.ఇలా తన సినిమా సక్సెస్‌పై బన్నీ అభినందనలు అందించడం సంతోషంగా ఉందంటూ నాగ వంశీ సోషల్ మీడియాలో చెప్పారు.