అమిత్ షా సభలో చేరికలు లేకపోవడంతో బిజెపి ఆశాభంగం

Saturday, September 7, 2024

తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నామని బిజెపి నేతలు ఎంతగా చెప్పుకొంటున్నప్పటికీ ఎన్నికలలో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు, కనీసం అన్ని పోలింగ్ స్టేషన్ లలో పోలింగ్ ఏజెంట్ లను పెట్టుకోగల అభ్యర్థులు లేరని వారికి తెలుసు. అందుకనే, దేశంలో ఎక్కడా లేనివిధంగా `చేరికల కమిటీ’ అంటూ ఒకటి ఏర్పర్చి, ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహించేందుకు భారీ కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ కసరత్తు చెప్పుకోదగిన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఏదో ఒకటి చేయాలని పార్టీ జాతీయ నాయకత్వం నుండి వత్తిడులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చేవెళ్లలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రసంగించిన బహిరంగసభ సందర్భంగా చాలా మంది ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరబోతున్నారంటూ భావించారు.

ఆ మేరకు మీడియాతో కూడా చెప్పారు. కానీ ఒక్క నేత కూడా కొత్తగా చేరాక పోవడంతో ఆశాభంగం చెందినట్లు అయింది. ముఖ్యంగా ఇటీవలనే బీజేపీ నుండి సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి  జూపల్లి కృష్ణరావులను బీజేపీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు.

అమిత్ షా సభలో వారిని పార్టీలో చేర్పించడం ద్వారా తమ ఘనతను ఆయన ముందు చాటుకోవాలని తెలంగాణ బిజెపి నాయకులు ప్రయత్నం చేశారు. అయితే, వారిద్దరూ బీజేపీలో చేరేందుకు సుముఖత చూపలేదని తెలుస్తున్నది. వారు ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకు వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వారి మద్దతుదారులు బీజేపీలో చేరిక పట్ల ఆసక్తి కనబడక పోవడం లేదు.

బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు ఎవ్వరూ సంతోషంగా లేకపోవడంతో, క్షేత్ర స్థాయిలో ఏమాత్రం బలం లేని నాయకుల పెత్తనం అక్కడ ఎక్కువగా ఉందనే అభిప్రాయంతో వారు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

బిఆర్ఎస్ ను ఓడించే పార్టీలో చేరతామని వారిద్దరూ పైకి చెబుతున్నారు. ఈ విషయంలో వారి ముందు బిజెపి, కాంగ్రెస్ మాత్రమే ఉన్నాయి. గ్రామాలలో బిజెపికి పట్టు లేకపోవడం, కాంగ్రెస్ లో బహునాయకత్వం ఉండడం వారిని ఒక నిర్ణయం తీసుకోలేని విధంగా చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా లేదా తెలంగాణ నాయకులు ఢిల్లీలో కలిసినప్పుడల్లా ఇతర పార్టీల నుండి ఎవరెవరు చేరుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కేవలం తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారి, ఏపార్టీ వారు కూడా సీటు ఇవ్వడానికి సుముఖంగా లేరనుకున్న వారు మాత్రమే బీజేపీలో చేరుతున్నారు. అటువంటి వారి వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండబోదని బిజెపి శ్రేణులు సహితం భావిస్తున్నారు.

బద్వేల్‌లో వీరా రెడ్డి లాంటి నా

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles