అమిత్ షాకు పొంగులేటి, జూపల్లి షాక్!

Wednesday, December 18, 2024

ఎంతగా ప్రయత్నించినా బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులకు షాక్ ఇచ్చే విధంగా పొంగులేటి స్వస్థలమైన ఖమ్మంలో బీజేపీ 15న జరిపే బహిరంగసభలో ప్రసంగించేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వస్తున్నారు.

అయితే, ఇక్కడ డిపాజిట్లు కూడా దక్కించుకొని సామర్థ్యం లేని బిజెపి తననే టార్గెట్ గా పెట్టుకొని ఈ విధంగా చేస్తుండడంతో
అమిత్ షా రావడానికి ఒకరోజు ముందే తన కాంగ్రెస్ ప్రవేశం గురించి బహిరంగ ప్రకటనకు పొంగులేటి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా జత కలవనున్నారు.

వీరు ముగ్గురూ కలిసి బుధవారమే హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌లో తమ చేరిక విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ను వీడాల్సివచ్చిన పరిస్థితులు, తాము ఎదుర్కొన్న ఇబ్బందులతోపాటు తమ భవిష్యత్తుపై నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారని తెలిసింది. ఈ ముగ్గ్గురు నేతలు కాంగ్రె్‌సలోకి వెళ్లడమనేది అధికార బిఆర్ఎస్ తో పాటు  కాకుండా బీజేపీకి కూడా ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

ఒక విధంగా అమిత్ షా రాక సందర్భంగా బలప్రదర్శనకు సిద్ధం కావడం ద్వారా బిజెపికి ఆగిపోయి, కాంగ్రెస్ వైపుకు వెడుతున్న చేరికలు చెక్ పెట్టాలనే బీజేపీ నేతల ఎత్తుగడలకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది.  పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకే చెందిన నేత కావడం, ఖమ్మంలో అమిత్‌షా సభకు ముందురోజే తన నిర్ణయాన్ని వెల్లడించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అదీకాకుండా, వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుండి అసెంబ్లీకి పోటీ చేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చాలాకాలంగా బిఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉంటూ వస్తున్న పొంగులేటి ప్రధానంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధోరణిపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకనే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకొనే పార్టీలో చేరతానని చెబుతూ వస్తున్నారు.

మొదటి బిజెపి వైపు మొగ్గు చూపినా, ఆ పార్టీకి అటువంటి సామర్థ్యం లేడనై నిర్ధారించుకొని కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఒకదశలో బిఆర్ఎస్ అధిష్ఠానం ఆయనతో మాట్లాడినా, స్వయంగా కేటీఆర్ జోక్యం చేసుకొన్నా పార్టీలో ఉండేందుకు ఇష్టపడలేదు. దీంతో సీఎం కేసీఆర్‌ ఒక సందర్భంలో, ‘‘పొంగులేటి పోతాడు.. వదిలేయండి’’ అని అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారు.

అయితే పొంగులేటి ఒంటరిగా కాకుండా  జిల్లాలోని తన అనుచర గణాన్ని వెంట తీసుకొని మరీ పార్టీని వీడుతున్నారు. పొంగులేటితో మరెవ్వరు పార్టీని వదిలి కాకుండా చూసేందుకు మంత్రులు, కేటీఆర్ ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆయన గత కొన్నినెలలుగా నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బలసమీకరణ చేస్తూ వచ్చారు.

తొలుత బీజేపీలో చేరాలని పొంగులేటి భావించినా అనుచరులు విముఖత వ్యక్తం చేయడం, కాంగ్రెస్ లో చేరడం మంచిదని స్పష్టం చేయడంతో ఆయన చివరకు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యాను. ఆయనతో పలు దఫాలుగా చర్చలు జరిపిన బిజెపికి ఒక విధంగా పొంగులేటి నిర్ణయం తీవ్ర అసంతృప్తి కలిగించింది.

అందుకు  కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తోడు కావడంతో మొత్తం తెలంగాణలోనే బిజెపి గ్రాఫ్ పడిపోతున్న సంకేతాలకు దారితీస్తుంది. అందుకనే పట్టుబట్టి అమిత్ షా బహిరంగసభ ఖమ్మలో జరుపుతున్నారు. ఆయన రాకకు ముందు రోజే తన కాంగ్రెస్ ప్రయాణాన్ని ప్రకటించేందుకు సిద్ధం కావడం ద్వారా బిజెపికి ఆశాభంగం కలిగినట్లయింది.

బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పట్ల అసంతృప్తిని తొలుత పొంగులేటి ఒక్కరే ప్రకటించగా,  నెల రోజుల క్రితం ఆయనకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తోడయ్యారు. ఇద్దరూ కలిసి పలువురు నేతలతో రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. వారం రోజుల క్రితం వీరికి బీఆర్‌ఎ్‌సకే చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి జత కలిశారు.

దీంతో ముగ్గురూ కలిసి టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవితో చర్చలు జరిపారు. ఈ 14న సంయుక్తంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఈ పరిణామం భవిష్యత్తులో తమకు బూస్ట్‌గా ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

అయితే, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్‌ గద్వాల జోగుళాంబ జిల్లాలో జరిపిన పర్యటనలో పాల్గొనడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles