అమరావతి కేసులో `సుప్రీం’లో ఏపీకి చుక్కెదురు

Wednesday, January 22, 2025

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది వరకు పేర్కొన్నట్లుగా మార్చి 28నే విచారణ చేపడతామని తేల్చిచెప్పింది.

హడావుడిగా సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి, సానుకూలంగా తీర్పు వస్తే ఉగాది నాటి నుండి విశాఖపట్నం నుండి ప్రభుత్వ కార్యక్రలాపాలు జరపాలని చూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.

అమరావతి ఏకైక రాజధానిగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ఇంకా విచారణకు రాలేదు. గత నెల్లో విచారణ జరగాల్సి ఉండగా ఫిబ్రవరి 14వ తేదీన సీజే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మొదట విచారణకు వచ్చిన కేసులు బుధ, గురు వారాల్లో విచారించాలని ఉత్తర్వు లు జారీ చేసిన కారణంగా లిస్టింగ్‌ కాలేదు. ముందుగా నిర్దేశించిన ప్రకారం గత నెల 23వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

ప్రభుత్వం ఓ వైపు ఉగాది నాటికి విశాఖకు పాలనా రాజధాని ని తరలించే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో త్వరితగతిన విచారణ జరిగితే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో మూడు రాజధానుల అంశంపై త్వరితగతి విచారణ జరపాల్సిందిగా బుధవారం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

రాజధానుల అంశాన్ని విచారిస్తున్న ధర్మాసనంలో గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ అమానుల్లా కూడా ఈ సారి ధర్మాసనంలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. కాగా, 28వ తేదీ ఒక్కటే సరిపోదని మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. అయితే, మార్చి 29, 30 తేదీలు బుధ, గురువారాలని నోటీసులు ఇచ్చిన కేసులను ఆ తేదీల్లో విచారణ జరపరాదని ధర్మాసనం తెలిపింది.  దీనిపై సీజేఐ సర్క్యులర్‌ ఉందని గుర్తుచేసింది.

ఆ రెండు రోజుల్లో విచారణ తన చేతుల్లో లేదని ఆ విషయంలో సీజేఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ చెప్పారు. అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని,అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ స్పష్టం చేశారు. అలా చేస్తేనే సార్థకత ఉంటుందని చెప్పారు.

దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. అంతకు మించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా ధర్మాసనం నిరాకరించింది.

విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని గుర్తింపునకు శివరామకృష్ణన్‌ కమిటీ వేశామని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది. అయితే మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమతో సంప్రతింపులు జరపలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని వాదిస్తూ 2014లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ఒతో సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

విభజనతో పాటు రాజధాని అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే వి ధంగా వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇందులో కేంద్ర వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంది. విభజన చట్టం అంశాలతో పాటు రాజధానులకు సంబంధించి ఒకేసారి విచారణ జరపాలని భావించిన సుప్రీం కోర్టు విడివిడిగానే విచారణ జరుపుతామని ప్రకటించింది. దీంతో ముందుగా మూడు రాజధానులపై స్పష్టత వస్తే మంచిదనే భావనతో మరోసారి అమరావతి పై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles