అభ్యర్థుల జాబితాతో కర్ణాటక బీజేపీలో ప్రకంపనలు

Sunday, December 22, 2024

ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు కాంగ్రెస్, జేడీఎస్ సగం మందికి పైగా అభ్యర్థుల జాబితాలను చాలా ముందుగానే ప్రకటించగా, ఢిల్లీ మాత్రం ఢిల్లీలో నాలుగు రోజుల పాటు కసరత్తు చేసి మంగళవారం రాత్రి విడుదల చేసిన్స్ 189 మంది అభ్యర్థుల మొదటి జాబితా పార్టీలో అసమ్మతి రాజుకోవడానికి దారితీసింది. తీవ్ర అసంతృప్తి పలు చోట్ల వ్యక్తమైనది.

తనను పోటీ చేయవద్దని చెప్పడం పట్ల మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టార్ తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తమవుతున్నాయి. తాను వరుసగా ఆరు సార్లు 25 వేల మేరకు ఆధిక్యతతో గెలుస్తూ వస్తున్న హుబ్లీ ధార్వాడ సీట్ ను ఇప్పుడు చివరి నిముషంలో పోటీ చేయవద్దని చెప్పడం తనను అవమానించడమే అని స్పష్టం చేస్తున్నారు. రెండు, మూడు నెలల ముందు చెప్పివుంటే గౌరవంగా ఉండేదని పేర్కొన్నారు.

తనకు సీట్ ఇవ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సంకేతం ఇచ్చారు. అయితే ఆయనకు మాజీ ముఖ్యమంత్రి బి ఎస్ యడ్యూరప్ప కూడా మద్దతు ప్రకటించారు. రెండో జాబితాలో ఆపార్టీ ఆయనకు తప్పకుండా సీట్ ఇవ్వగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవంక, టికెట్ కేటాయించ‌క‌పోవ‌డంతో మాజీ ఉప ముఖ్యమంత్రి  ల‌క్ష్మ‌ణ్ స‌వాది పార్టీకి రాజీనామా చేశారు. బీఎస్‌ యడియూరప్పకు విధేయుడుగా పేరున్న సవాడికి లింగాయత్ సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉంది. 2018 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుంటహల్లి చేతిలో ఓడియారు.

2019లో పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరి, యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన 17 మంది ఎమ్మెల్యేలలో కుంటహల్లి ఉన్నారు. తాజాగా సవాడీని పక్కనపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే మహేష్ కుంటహళ్లికే చోటు దక్కడంతో సవాడే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

ఇక బెంగ‌ళూర్ న‌గ‌రంలోని జ‌యాన‌గ‌ర్ నుంచి పార్టీ టికెట్ ల‌భించ‌క‌పోవ‌డంతో ఎన్ఆర్ ర‌మేష్ వ‌ర్గీయులు 1200 మంది పార్టీని వీడారు. పార్టీ అభ్య‌ర్ధుల తొలి జాబితా ప్ర‌క‌టించిన వెంటనే ర‌మేష్ వ‌ర్గీయులు నిర‌స‌న‌ల‌కు దిగారు. ఇక ర‌నెబెన్నూర్ స్ధానం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఎమ్మెల్సీ ఆర్ శంక‌ర్ పార్టీ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో రాజీనామా చేయ‌నున్నారు. ర‌నెబెన్నూర్ నుంచి స్వతంత్ర అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగేందుకు ఆయ‌న స‌న్న‌ద్ధ‌మ‌య్యారు.

కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక నేతలైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ లను ఓడించడం సాధ్యం కాదని బిజెపి ఒక నిర్ణయానికి వచ్చిన్నట్లుంది. వీరిద్దరిపై పోటీకి ఇద్దరు మంత్రులను బీజేపీ బరిలో దింపింది. వరుణలో సిద్ధరామయ్యపై వీ సోమన్నను, కనక్‌పురలో డీకే శివకుమార్‌పై ఆర్‌ అశోకను అభ్యర్థులుగా ఖరారు చేసింది.

అయితే, ఆ ఇద్దరు మంత్రులు కూడా వేరుగా మరో నియోజకవర్గం నుండి, అంటే ఒకొక్కరు రెండు నియోజకవర్గాల నుండి పోటీచేస్తున్నారు. సోమన్న వరుణతో పాటు చామరాజనగర్‌లో, అశోక కనకపురతో పాటు పద్మనాభనగర్‌ నుంచి పోటీ చేయనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేశ్‌ జార్కిహోళికి గోకక్‌ టికెట్‌ ఇచ్చింది. ఐఎంఏ కుంభకోణం కేసులో నిందితుడు, విశ్రాంత కేఏఎస్‌ అధికారి ఎల్‌సీ నాగరాజ్‌కు మధుగిరి టికెట్‌ ఇచ్చింది. హిజాబ్‌ను నిషేధించాలని ప్రచారం చేసిన యశ్‌పాల్‌ సువర్ణకు ఉడిపి టికెట్టు దక్కింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రఘుపతి భట్‌ను పక్కనపెట్టి మరీ యశ్‌పాల్‌ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles