అప్పుల కుప్పగా ఏపీ … `అప్పు రత్న’ బిరుదు ఇచ్చిన పవన్

Wednesday, January 22, 2025

అన్ని పరిమితులు మించి విశేషంగా అప్పులు చేయడం ద్వారా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు దేశంలోనే ఖ్యాతి గడించింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఏపీ అప్పుల కుప్పగా మారిందని వెల్లడించింది.  గడచిన 9 నెలల్లో ఏపీ సర్కార్ రూ. 55 వేల కోట్ల అప్పులు ఏపీ ప్రభుత్వాన్ని `అభినందిస్తూ’ జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ సీఎం వైఎస్ జగన్ కు భారతరత్న మాదిరిగా `అప్పు రత్’న అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి రాతపూర్వక ఇచ్చిన సమాధానంలో 2019 తో పోలిస్తే ప్రస్తుతం ఏపీ అప్పులు దాదాపు రెండింతలయ్యాయని వెల్లడించారు. ఏపీ అప్పుల భారం ఏటేటా పెరుగుతోందని చెప్పారు.

అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ విచ్చల విడిగా అప్పులు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని మందలించవల్సింది పోయే, ఎప్పటికప్పుడు కొత్త అప్పుల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం బాసటగా నిలబడుతూ ఉండడం విస్మయం కలిగిస్తోంది. వారిద్దరి మధ్య గల అలౌకిక బంధంపై ఆశ్చర్యం వేస్తుంది.

బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 4, 42, 442 కోట్లు అని పంకజ్ చౌదురి తెలిపారు. ఇంతటి ఘనత సాధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు పవన్ కల్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

“అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు… సీఎం జగన్‌కు ‘నా ప్రత్యేక శుభకాంక్షలు .. కీప్ ఇట్ అప్” అంటూ వ్యంగంగా అభినందనలు తెలిపారు. ‘‘మీ వ్యక్తిగత సంపదను పెంచుకోవడం మర్చిపోవద్దు.. రాష్ట్ర సంపద, ప్రగతి ‘కుక్కల’కి వెళ్లనివ్వండి.. కానీ మీ వ్యక్తిగత సంపద, ఆస్తులు.. ఎప్పటికీ అవే స్పూర్తి.. సీఎం అప్పు రత్నా’’ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
2019లో ఏపీ ప్రభుత్వ అప్పు రూ. 2,64, 451 కోట్లు ఉండగా, 2020 లో రూ.3,07, 671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022 లో రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

బడ్జెట్ అప్పులకు తోడు, కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో ఏపీ చేస్తున్న అప్పులు అదనమని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం అప్పు రూ. 10 లక్షల కోట్లకు చేరిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏటేటా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు పెరిగి పోతున్నాయి. మరోవైపు కొత్త అప్పుల కోసం వైసీపీ సర్కారు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

జనవరి నుంచి మార్చి కాలానికి గాను రూ.12,000 కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆర్బీఐకి అప్పుల కేలండర్‌ పంపింది. జనవరిలో రూ.7,000 కోట్లను, ఫిబ్రవరిలో రూ.4,000 కోట్లను, మార్చిలో రూ.1,000 కోట్లను తీసుకుంటామని పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రం అప్పులు రూ.9 లక్షల కోట్లు దాటేశాయి. జీఎస్‌డీపీలో ఇవి 75 శాతంగా ఉన్నాయి. 2018లో కేంద్రం సవరించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు జీఎ్‌సడీపీలో 20 శాతం మించకూడదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఉండాల్సిన పరిమితి కంటే 55 శాతం ఎక్కువగా ఉన్నాయి. చెల్లించాల్సిన బిల్లులతో కలిపి గత ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ప్రభుత్వ అప్పులు రూ.1,04,000 కోట్లకు చేరాయి. అయినా కొత్త అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles