అదానీ అక్రమాలతో అనంతపురం రైతుల గగుర్పాటు

Wednesday, January 22, 2025

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకు చెందిన కంపెనీలు స్టాక్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటం, దానితో అదానీ ఆస్తుల విలువ దాదాపు సగంకు పడిపోవడంతో అనంతపూర్ జిల్లాలోని రైతులు కలవరం చెందుతున్నారు. ఈ జిల్లాలో ప్రతిపాదించి సోలార్‌ పార్కుకు భూమిలిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతున్నది.

గతంలో లాగా భూములను సోలార్‌ పార్కు కోసం పూర్తి స్థాయిలో సేకరించడం లేదు. లీజు పద్ధతిలో సేకరించేందుకు అనుమతినిచ్చారు. ఏడాదికి ఎకరానికి రూ.30 వేలు లీజు చెల్లించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ ఉత్తర్వుల్లో లీజు సంస్థ చెల్లించకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి భరోసా లేదు. మరోవైపు అదాని సంస్థ పెద్ద ఎత్తున మోసపూరిత విధానాలు అనుసరిస్తోందంటూ వెల్లడవుతూ ఉండడంతో రైతులు ఖంగారు పడుతున్నారు.

దీంతో సంస్థ సంస్థ లీజు చెల్లించకపోతే పరిస్థితి ఏమవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తమకు భరోసా ఇవ్వాలని రైతులు కోరుతున్నది. సోలార్‌ పార్కు కోసమని లీజు పద్ధతిలో భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోంది. ఇది వరకే భూములు కేటాయిస్తూ మంత్రివర్గంలోనూ తీర్మానం చేసింది.

అనంతపురం జిల్లాలోని నాలుగు మండలాల్లోని డి.హీరేహల్‌, కణేకల్‌, రాయదుర్గం, బొమ్మనహల్‌ మండలాల్లోని 13 గ్రామాల్లోని 11831.81 ఎకరాల భూమిని సోలార్‌ సార్కు కోసం గుర్తించారు. ఇందులో 9817.18 ఎకరాలు పట్టా భూములు, 557.52 ఎకరాలు ప్రభుత్వ భూమి, 1457.14 అసైన్డ్‌ భూమిని గుర్తించారు.

ఆదాని కంపెనీకి భూములివ్వాలని కోరారు. అయితే ఇప్పటి వరకు ఒప్పందాలు జరగలేదు. ఇప్పుడేమో ఆ సంస్థపై పెద్దఎత్తున వార్తా కథనాలు వస్తున్నాయి. కొంత అయోమయంలోనూ ఉంది. ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా భరోసానిస్తే తాము ఆలోచిస్తాం. లేకపోతే ఇవ్వడం సాధ్యమవదు.

లీజుకు ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం కాబట్టే, నిర్ధేశించిన మొత్తానికి ప్రభుత్వమే హామీ ఉండాలని స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ ఉమ్మడి జిల్లాలో లేపాక్షి నాలెడ్జి హబ్‌ పేరుతో 8484 ఎకరాల భూములు ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టారు. భూములు తీసుకున్న వారు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. రైతులకు భూములుపోయాయి. ఉపాధి రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles