అంతుబట్టని బీజేపీ దూకుడుపై కేసీఆర్ మౌనం!

Saturday, January 18, 2025

బిజెపిని జాతీయ స్థాయిలో బ్రష్టు పట్టించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించుకున్న `ఎమ్యెల్యేల కొనుగోలు కేసు’ను తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పచెప్పడం, ఆ వెంటనే ఈ కేసులో కీలక నిందితుడిగా బిఆర్ఎస్ ప్రచారం చేస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేయడంతో మరో రాజకీయ పోరుకు రంగం సిద్దమైన్నట్లు అందరు భావించారు. 

తనను కేసులో ఇరికించిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అంటూ సంతోష్ నేరుగా కేసీఆర్ నే  హెచ్చరించారు. ఈ కేసులో తనపై చేసిన ఆరోపణలకు తగు సమయంలో సమాధానం చెబుతాను అంటూ ప్రకటించారు. అంతేకాదు, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో కేసీఆర్ ను ఓడించి, బిజెపిని అధికారంలోకి తీసుకు రావడం కోసం `మిషన్ 90′ పెరిగే వ్యూహరచన కూడా చేశారు. 

ఇంతగా ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్ గాని,  ఆయన కుమారుడు కేటీఆర్ గాని, ఇతర మంత్రులు గాని, పార్టీ నాయకులు గాని మూడు రోజులుగా ఎటువంటి సమాధానం ఇవ్వక పోవడం గమనార్హం. కనీసం హైకోర్టులో సింగల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాన్ని డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడం కూడా ఇంకా చేయలేదు. మరోవంక, హైకోర్టు ఆదేశంపై కేసును చేపట్టిన సిబిఐ సహితం ఇంకా ముందడుగు వేస్తున్నట్లు లేదు. 

ఈ కేసులో ఫిర్యాదుదారుడైన పైలట్ రోహిత్ రెడ్డి రెండోసారి, డిసెంబర్ 30న ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఎందుకు అయ్యారో ఇంతకు ముందు వలే ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈడీ సహితం తర్వాత తీసుకోబోయే చర్య గురించి స్పందించని లేదు. సిబిఐ, ఈడీలు రంగప్రవేశం చేయడంతో తొందర పడితే తన ప్రభుత్వంకు ముప్పు రాగలదని కేసీఆర్ వేచి, చూసే ధోరణి ఆవలంభిస్తున్నారా?

మరోవంక, కేంద్ర ప్రభుత్వం సహితం కేసీఆర్ వేయబోయే అడుగుల గురించి ఎదురు చూస్తున్నదా? కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐ ఛార్జ్ షీట్ లలో పేరొచ్చినా ఇంకా కేసీఆర్ కుమార్తె కవితకు ఈడీ నోటీసులు పంపక పోవడం గమనార్హం. వాస్తవానికి ఇప్పటికే పంపగలరని అందరూ అంచనా వేశారు. బిజెపి – బిఆర్ఎస్ తాము వేయబోయే అడుగుల గురించి దాగుడు మూతలు ఆడుతున్నట్లు కనిపిస్తున్నది. 

 ‘నిన్ను చూసే కాదు.. నీ తండ్రిని చూసి కూడా మేం భయపడము. మీ కళ్ల ముందే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అప్పుడు ముంబై కాలిపోతుందన్నారు. కానీ అగ్గిపుల్ల కూడా మండలేదు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై తీవ్రస్థాయిలో విరుచుకు పడటం గమనార్హం. అంతేకాదు, గత ప్రభుత్వంలోని కొందరు ప్రముఖులను జైలు పాలు కూడా చేశారు. 

అటువంటి పరిస్థితులు తెలంగాణాలో ఏర్పడకుండా చూడటం కోసం ఇటు కేసీఆర్, అటు బిజెపి కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. అటువంటి పరిస్థితి ఏర్పడితే ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నదని కేసీఆర్ భావిస్తుంటే, ఆ విధంగా చేస్తే ప్రజలలో వారి పట్ల ఎక్కడ సానుభూతి పెరుగుతుందో అన్న ఆందోళన బిజెపి నాయకులలో వ్యక్తం అవుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles