స్టీల్ ప్లాంట్ కోసం జెడి కామెడీ… కేఏ పాల్ తో భేటీ!

Friday, December 6, 2024

సిబిఐ కేసులలో వైఎస్ జగన్  మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో అవినీతి పరులను వెంటాడే పోలీస్ అధికారిగా వచ్చిన  ఉపయోగించుకొని, రాజకీయాలలో రాణించాలని ఐపీఎస్ కు రాజీనామా చేసి వచ్చే ఏళ్ళు గడుస్తున్నా దారి దొరకకపోవడంతో అసహనంతో ఉన్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇప్పుడు `స్టీల్ ప్లాంట్’ పేరుతో విశాఖ నుండి ఎట్లాగైనా ఎంపీగా గెలిచేందుకు అసహనంతో వ్యవహరిస్తున్నారు.

ఎంపీగా పోటీ చేస్తానన్నా ఏ రాజకీయ పార్టీ కూడా సీట్ ఇస్తామని ముందుకు రాకపోవడంతో, సొంతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించినా అందుకు ధైర్యం సరిపోవడం లేదు. అందుకనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడగలిగింది తానే అనే అభిప్రాయం ప్రజలలో కలిగించడం ద్వారా రాజకీయంగా ఏదో ఒక దోవ దొరుకుతుందని ప్రయత్నం చేస్తున్నట్లున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా చూడాలంటూ ఏపీ హైకోర్టులో దావా వేసినా ఇప్పటిలో అది తేలేటట్లు కనిపించడం లేదు. తాజాగా స్టీల్ ప్లాంట్ ఏదో బీడ్ ను ప్రకటిస్తే `క్లౌడ్ ఫండింగ్’ ద్వారా ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటానంటూ చిట్కా వైద్యాన్ని ప్రకటించారు. దీని పట్ల కూడా ప్రజలలో చెప్పుకోదగిన స్పందన కనిపించడం లేదు.

తాజాగా, ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో `కామెడీ స్టార్’ గా పేరొందిన ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏపాల్ ని కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు సహకరించమని కోరినట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని… ఇందులో భాగంగానే పాల్ ను కలిశానని చెప్పారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం కోసం తన ఆస్తులను కూడా అమ్ముతానని భరోసా ఇచ్చిన్నట్లు మరోవంక పాల్ చెబుతున్నారు.  పాల్ రాజకీయాలను, మాటలను రెండు తెలుగు రాస్త్రాలలో ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. అటువంటి పాల్ ను కలసి స్టీల్ ప్లాంట్ కాపాడమని కోరడం ద్వారా లక్ష్మీనారాయణ తనలో నెలకొన్న అసహనాన్ని వ్యక్తపరచి నట్లయింది.

ఈ సందర్భంగా సంబంధం లేని అంశాలను పాల్ ప్రస్తావించినట్లు కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలి తనతో చేతులు కలపాలని చెప్పారు. జనం తమ హక్కులను కాపాడుకోవాలంటే ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వాలని అంటూ చెప్పుకొచ్చారు.

జెడి లక్ష్మీనారాయణ అసలు పాల్ ను ఎందుకు కలిసిన్నట్లు? నిత్యం ఏదోఒక విధంగా మీడియాలో నానుతూ ఉండడం ద్వారా ఓ రాజకీయ ఆధారం దొరికేవరకు కాలం గడిపేందుకు చేస్తున్న ప్రయత్నమా? ఆయనకు అసలు నిర్దుష్టమైన రాజకీయ ఉద్యమం అంటూ ఉందా? ఏదైనా రాజకీయ కార్యాచరణ ప్రణాళిక ఉందా?

ఐపీఎస్ కు రాజీనామా చేసిన అనంతరం రైతు సమస్యలు తెలుసుకునేందుకు గ్రామాలలో పర్యటనలు చేశారు. ఆ పర్యటనల పర్యవసానం ఏమైంది? రైతు సమస్యలకు సంబంధించి ఏదో ఒక అంశంపై అయినా ఉద్యమం చేపట్టారా? కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం గురించిన ప్రసంగాలు చేయడం ద్వారా రాజకీయంగా నిలదొక్కుకోవడం సాధ్యం కాదని గ్రహించాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles