ప్రారంభమైన చిరంజీవి పోరాటం!

Thursday, April 18, 2024

చిరంజీవి హీరోగా యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ట కాంబోలో వస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌  శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. బ్లాక్‌బస్టర్ ‘బింబిసార’ను అందించిన తర్వాత వశిష్ట, మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్‌ను లార్జర్ దెన్ లైఫ్ పాత్రలో ప్రెజెంట్ చేయడానికి హ్యుజ్ స్పాన్ వున్న కథను సిద్ధం చేశాడు.

యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయిక. ఇటీవలే కొన్ని టాకీ పార్ట్‌లు, ఒక పాట, ఒక యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించిన షెడ్యూల్‌ను ముగించిన మేకర్స్, హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌ను ప్రారంభించారు.ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని అల్లుమియం ఫ్యాక్టరీలో చిరంజీవి, కొంతమంది ఫైటర్స్‌పై ప్రస్తుతం హై-ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.

యాక్షన్ సీక్వెన్స్‌ను గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి10న విడుదల కానుంది ఈ సినిమా.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles