వైసీపీ మాటల్లో తిరోగమన బుద్ధులు!

Friday, December 5, 2025

జగన్మోహనరెడ్డి అయిదేళ్ల పాలన చూసిన వారికి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఎలాంటి ఆ పనులు చేపట్టకుండా.. రాష్ట్రాన్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిపాలించడం ఆయనకు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. అమరావతి విషయంలో కూడా ఆయన ఇదే తరహాలో తన ముద్రను నిరూపించుకున్నారు. అందుకే ఆయనకు 11 సీట్లు మాత్రమే కేటాయించి, ఇంటికి పరిమితం చేశారు ప్రజలు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి మరింత దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఉన్నది ఉన్నట్టుగా ఉంచడం కాదు.. మరింతగా దిగజార్చడానికి వైసీపీ దళాలు ప్రయత్నిస్తున్నాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న రోజుల్లో… మొత్తం వ్యవస్థలను వెనక్కు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘంతో జరిగిన సమావేశంలో.. ఈవీఎంల మీద తమకు రకరకాల అనుమానాలున్నాయని, బ్యాలెట్ పద్ధతిలో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలనేది తమ డిమాండు అని.. వైసీపీ నాయకులు వైవీసుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు అంటున్నారు.

ప్రపంచంలోని అనేక దేశాలు మన దేశంనుంచి ఈవీఎంలు తెప్పించుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం అని.. ఎన్నికల సంఘం అధికారులు పదేపదే చెబుతూ నిరూపిస్తున్నారు కూడా. ఈవీఎంలు మాత్రమే కాదు.. ఆన్ లైన్ లో కూడా ఓటు వేయగలిగేలా సరికొత్త విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి.. పోలింగ్ శాతం గరిష్ఠంగా పెంచడం ద్వారా.. పారదర్శకమైన ఎన్నికలు జరగడానికి సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ప్రపంచమంతా మారుతున్న కొత్త సాంకేతికలను అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుండగా.. వైఎస్ జగన్ దళాలు మాత్రం మళ్లీ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలంటూ సమాజాన్ని వెనక్కు నడిపించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.

2019 ఎన్నికల్లో వైసీపీ వాళ్లు గెలిచినప్పుడు వారికి ఈవీఎంలు సర్వాంగ సుందరంగా కనిపించాయి. అప్పుడు వారికి 151 సీట్లు వచ్చాయి. కానీ అయిదేళ్లు గడిచిన తర్వాత అవే ఈవీఎంలు ఎన్డీయే కూటమి పార్టీలకు కలిపి 164 సీట్లు కట్టబెట్టే సరికి.. ఇప్పుడు అదే ఈవీఎం లు విలన్లులాగా కనిపిస్తున్నాయి. అవి వద్దని అంటున్నారు.

ఏదైతే ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందో అలాంటి డిమాండ్లు వినిపించడం ద్వారా అతి చేస్తున్నారు. ఓటరు స్లిప్పులు అన్నీ లెక్కించాలని అప్పుడు నిజమైన ఫలితం వస్తుందని వైసీపీ డిమాండ్ చేస్తే ఈసీ నో చెప్పింది. దాంతో ఇప్పుడు ఏకంగా బ్యలెట్ పేపర్ ఎన్నికు కావాలంటూన్నారు. బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుపోవడం, తద్వారా ఎన్నికలు వాయిదా పడేలా చేయడం వంటి వ్యవహారాల్లో ఆరితేరిపోయిన వైసీపీ దళాలు అలాంటి అక్రమాలను రిపీట్ చేయడానికే  వైసీపీబ్యాలెట్ ఎన్నికలు కోరుకుటున్నట్టు కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles