దాడుల నెపంతో తప్పుకోవాలనుకుంటున్న వైసీపీ?

Monday, December 8, 2025

పులివెందులలో జరిగే ఒక ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఉంటే పరువు పోతుంది కదా? వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా నుంచి కూడా.. తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న నియోజకవర్గంగా వారు ప్రచారం చేసుకునే పులివెందులో జడ్పీటీసీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంటే.. అందులో అసలు పార్టీ పార్టిసిపేట్ చేయకపోతే దాని సంకేతాలు ఎలా వెళతాయి? ఎంతగా భ్రష్టుపట్టిపోతారు? పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఎంత అవమానమో కదా? అని పార్టీ కార్యకర్తలు గానీ, నాయకులు గానీ అనుకుంటారు.

కానీ.. వాస్తవంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికబరినుంచి తప్పుకునేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక జడ్పీటీసీ స్థానం పోతే పోయింది.. కానీ, కూటమి సర్కారు మీద, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడానికి మంచి అవకాశం దక్కుతుందని వారు ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్లేషణలు వస్తున్నాయి.

ఎందుకంటే.. కూటమి ప్రభుత్వం పరిపాలనలో తమ మీద విచక్షణా రహితంగా దాడులు జరుగుతున్నాయని  ఆరోపించడానికి, తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేయడానికి ఎన్నిక నుంచి తప్పుకుంటే గొప్పగా ఉంటుందని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ.. వైసీపీ వ్యూహాన్ని బయటపెట్టారు.

పులివెందులలో వైసీపీ గత రెండురోజులుగా చేస్తున్న హడావుడి చూస్తే ఎన్నికల బరినుంచి తప్పుకునేందుకు తాపత్రయపడుతున్నట్టుగా కనిపిస్తోందని భూమిరెడ్డి అంటున్నారు. అందుకోసమే ఎన్నికల నమయంలో పోలీసులు విధించే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరీ.. ఘర్షణలకు దిగుతున్నారని భూమిరెడ్డి అంటున్నారు. గ్రామాల్లో ఎప్పుడెప్పుడు ఏయే పార్టీలు ప్రచారం చేసుకోవాలో పోలీసులు ముందే స్పష్టంగా సమయం కేటాయిస్తారని, బుధవారం  తెలుగుదేశం పార్టీ ప్రచారానికి అనుమతి ఉండగా.. వారితో ఘర్షణకు దిగి.. కావాలనే నల్లగొండుపల్లెలో ఉద్రిక్తతలు పెంచారని అంటున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాను ముఖ్యమంత్రి కావడం తప్ప మరో ఎజెండా ఉండదు. మహా అయితే ఆయన రెండో ఎజెండా కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుంటారు. అందులో భాగంగానే.. తన సొంత మండలంలో జడ్పీటీసీ ఉపఎన్నికను పణంగా పెట్టడానికి కూడా ఆయన వెనుకాడడం లేదు. అందుకే అక్కడ పులివెందులలో ప్రాణాలు తీసేస్తున్నారు, రాక్షసరాజ్యం నడుస్తోంది, దాడులు చేస్తున్నారు.. అనే రకరకాల ఆరోపణలతో ఎన్నికల నుంచి తప్పుకోవాలని, ఓడిపోకుండా పరువు కాపాడుకోవచ్చునని, పనిలో పనిగా.. ఓటమి తప్పుతుందని జగన్ భావిస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles