చంద్రబాబునాయుడు సారథ్యంలో రాష్ట్రప్రజలకు భరోసా కల్పిస్తూ ఎన్డీయే కూటమి ఇచ్చిన ప్రధానమైన హామీల్లో సూపర్ సిక్స్ ముఖ్యమైనవి. అధికారంలోకి వచ్చిన తొలినాటినుంచి ఒక్కటొక్కటిగా ఇ హామీలను అమలు చేసుకుంటూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నది. ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలుగా ప్రకటించని అనేక విషయాలను కూడా.. అధికాంరలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమల్లో పెడుతూ పోతోంది. కొత్త హామీలను కూడా ప్రజలకు వరంగా అందిస్తున్నారు.
అయినప్పటికీ కూడా… అంచెలంచెలుగా అమలవుతున్న సూపర్ సిక్స్ విషయంలో ఇంకా మిగిలిన ఉన్న ఒకటిరెండింటిని పట్టుకుని.. ప్రభుత్వాన్ని పదేపదే నిందించడానికి విపక్ష వైఎస్సార కాంగ్రెస్ నాయకులు, జగన్మోహన్ రెడ్డి కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ.. వెటకారపు మాటలు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి తనను తాను పలుచన చేసుకుంటూ విమర్శలు సాగిస్తూవస్తున్నారు. ఇలాంటి నేథ్యంలో వైసీపీ వారి నోర్లు మూయించేలా.. ఇంకా పెండింగులో ఉన్న కీలకమైన హామీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటన చేశారు.
సూపర్ సిక్స్ లో ఇంకా పెండింగులో ఉన్న ప్రధానమైన హామీ ఆడబిడ్డ నిధిని త్వరలోనే అమలు చేయబోతున్నట్టుగా చెప్పారు.
సూపర్ సిక్స్ అనేవి చంద్రబాబు రాష్ట్రప్రజలకు ఇచ్చిన ఆరు ప్రధానమైన హామీలు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి తొలి 15 నెలల కాలంలోనే నాలుగు హామీలను అమలు చేసేశారు. ప్రజలనుంచి వాటిపట్ల అద్భుతమైన స్పందన వస్తోంది. నిర్మాణాత్మకమైన సంక్షేమం, ప్రజల జీవితాలను గుణాత్మకంగా మెరుగుపరిచే సంక్షేమానికి నిర్వచనంగా చంద్రబాబు అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలు ఉంటున్నాయనే ప్రశంసలు ప్రజలనుంచి వస్తున్నాయి. అయితే ఇంకా మిగిలి ఉన్న రెండు హామీలను మాత్రమే పదేపదే ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి దళాలు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడానికి తమ వంతు పాట్లు పడుతున్నాయి.
18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 వంతు ఆడబిడ్డ నిధిని అందజేస్తానని ప్రకటించిన హామీ అందులో ఒకటి. నిజానికి ప్రభుత్వానికి తమ హామీలు అమలు చేయడానికి ప్రజలు అయిదేళ్ల పదవీకాలం ఇచ్చారని మనం అర్థం చేసుకోవాలి. కానీ, బద్నాం చేయడమే లక్ష్యంగా వైసీపీ దళాలు నిందలు వేస్తుండగా.. ఈ ఆడబిడ్డ నిధి గురించి కూడా చంద్రబాబు తాజాగా ప్రకటన చేశారు. ఈ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన వెల్లడించారు.
ఇటీవలే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన నేపథ్యంలో.. తాజాగా ఆడబిడ్డ నిధి పథకం గురించి ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం ఈ హామీని పూర్తి విస్మరించినట్టుగా ప్రచారం చేస్తూ జగన్ దళాలు ప్రజల మెదళ్లలో విషం నింపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. త్వరలోనే ఈ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం అని చంద్రబాబు ప్రకటించడంతో.. వారి నోర్లకు తాళాలు వేసినట్లవుతోంది.
