ఈ నైపుణ్య కేంద్రాలే సర్కారు కుట్రలకు రుజువులు

Sunday, December 22, 2024

 371 కోట్ల రూపాయలను ప్రభుత్వ వాటాగా చంద్రబాబు నాయుడు సర్కారు విడుదల చేసిందని,  ఆ మొత్తం డబ్బులు ఇతర మార్గాల ద్వారా సెల్ కంపెనీలకు తరలించి స్వాహా చేశారని.. అంతిమ ప్రయోజనం చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కిందని..  ఆరోపణలు చేస్తూ ఆయనను అరెస్టు చేసి, నాన్బెయిలబుల్ సెక్షన్లు కూడా నమోదు చేసి..  రాజమండ్రి జైల్లో నిర్బంధించారు.  ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయిని చంద్రబాబు స్వాహా చేసి ఉంటే గనుక రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు అయిన స్కిల్ డెవలప్మెంట్ లేబరేటరీలు ఎలా ఏర్పాటయ్యాయి? వాటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు కేటాయించారు? అక్కడ శిక్షణ పొందిన వేలాదిమంది విద్యార్థులకు  దక్కిన ప్రయోజనం, నైపుణ్యాలు ఎలా అబ్బినట్లు? ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ ప్రశ్నలు!

 ఇప్పుడు ఏ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్  కేసు రూపంలో అయితే చంద్రబాబు నాయుడు దోషిగా  ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో గడుపుతున్నారో..  ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం ఆయన సర్కారు విడుదల చేసిన నిధులు 371 కోట్ల రూపాయలు మాత్రమే.  సీమెన్స్‌తో ఒప్పందంలో భాగంగా,  రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి,  ప్రతిచోట కోట్ల విలువైన యంత్రాలను శిక్షణ నిమిత్తం ఏర్పాటు చేశారు.  అవన్నీ అప్పటినుంచి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తూనే ఉన్నాయి.  ఈ యంత్రాలు,  ఈ కేంద్రాల నిర్వహణ,  ఖర్చులు పన్నులు చరిత్ర వ్యవహారాలకు పెద్ద మొత్తంలో సొమ్ము ఖర్చు అయి ఉండే అవకాశం ఉంది.  కేంద్రాలలో శిక్షణ పొందిన విద్యార్థులే..  శిక్షణ కేంద్రాలు పనిచేశాయ అనడానికి ప్రబల నిదర్శనాలు.  అయితే ఈ వాస్తవాన్నింటినీ విస్మరించి..  ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయిని చంద్రబాబు నాయుడు తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లుగా ఆరోపణలు గుప్పిస్తూ  ఆయన మీద కేసులు నమోదు చేశారు.  ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయం,  ఎస్వీ యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ,  అనంతపురం తదితర ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి.  చంద్రబాబు పై కేసులు నమోదైన తర్వాత  శిక్షణ కేంద్రాన్ని మూసివేశారు.  మిగిలిన చోట్ల ఎప్పటికీ శిక్షణలు జరుగుతూనే ఉన్నాయి. అనంతపురం జేఎన్టీయూలో ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఏకంగా 14 లాబరేటరీలు ఏర్పాటు చేశారు.  2018 -20 మధ్యకాలంలో  ఏకంగా 16 వేల మంది శిక్షణ పొందారు.  కళ్ళెందుకు కనిపిస్తున్న ఈ ల్యాబ్ లను,  శిక్షణలతో  ఉద్యోగాలు పొందిన విద్యార్థులను కూడా విస్మరిస్తూ చంద్రబాబు నాయుడుని వేధించడం ఒక్కటే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కేసులను ముందుకు తీసుకు వెళుతున్నదని ప్రజలు ఆక్రోశిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles