వైసీపీ పతనాన్ని శాసించేలా సజ్జల మాటలు!

Friday, January 10, 2025

2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిన పార్టీకి నాయకుడిగా.. కనీసం ప్రతిపక్ష నేత హోదాకు కూడా దిక్కులేని స్థితిలో ఎందుకు మిగిలిపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించుకోవడంలో ఆ పార్టీ నాయకులు ఎంత నిజాయితీగా సమీక్షలు చేసుకుని, కారణాలు తెలుసుకుంటే.. వారికి అంతగా భవిష్యత్తు ఉంటుంది. అలా చేయకుండా.. ఇప్పటికీ.. తమను తాము ఆత్మవంచన చేసుకుంటూ.. ఈవీఎంల మీదికి తమ ఓటమిని నెట్టేసి, లేదా, ఇతర సాకులు చెప్పి పబ్బం గడుపుకోవాలనుకుంటే వారికే నష్టం జరుగుతుంది. కానీ ఇప్పటికీ ఆ పార్టీలో అదే జరుగుతోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి ఉన్న ఎంపీపీలతో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి నిర్వహించిన సమావేశంలో ఆయన మాటలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

ఇంతకూ సజ్జల ఏం అంటున్నారంటే.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని సంక్షేమ యజ్ఞాన్ని జగన్ చేశారట. అప్పుడు చేసిన మంచి పనులే 2029లో రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తాయట. 2024 ఎన్నికలు ఆ పార్టీకి భిన్నమైన అనుభవాలను మిగిల్చాయట. కాబట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు గ్యారంటీ అనే ధీమాతో ఉండాలని సజ్జల వారికి హితోపదేశం చేస్తున్నారు.

సజ్జల మరీ ఇంత అమాయకంగా పార్టీ శ్రేణులందరినీ కూడా మాయ చేసేలా తప్పుదారి పట్టించేలా ఎలా మాట్లాడుతున్నారో ఆ పార్టీ వారికే అర్థం కావడం లేదు. 2019 నుంచి 24 వరకు జగన్ ఎలా పనిచేశారనేదానికి ప్రజల స్పందన ఏమిటో ఈ ఎన్నికల్లోనే వారు విపులంగా చూపించారు. మళ్లీ అదే అయిదు సంవత్సరాల పనితీరు.. ఇంకో అయిదేళ్లు తర్వాత గెలిపిస్తుందని సజ్జల ఏ నమ్మకంతో అనగలుగుతున్నారో అర్థం కావడం లేదు.

2024నుంచి అయిదేళ్లు పాటూ ఆ పార్టీ ఎలా పనిచేస్తుందనే దాన్ని బట్లి 2029 ఎన్నికలు డిపెండ్ అయిఉంటాయని, కాబట్టి పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని అనకుండా.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన మంచి వల్ల రాబోయే ఎన్నికల్లో గెలుస్తాం అని బుకాయింపు మాటలు మాట్లాడడం అనేది పార్టీకి చేటు చేయడమే అని పలువురు భావిస్తున్నారు. సజ్జల వంటి ఆషాఢభూతి నాయకులు సలహాదార్లుగా పార్టీని నడిపిస్తున్నందువల్లే పార్టీ ఇలా అవకతవకలుగా నడుస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles