జెండా గద్దెను కబ్జా చేస్తే గద్దె మీదకు వస్తారా?

Monday, December 23, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దురహంకారంతో చెలరేగి వ్యవహరిస్తున్న ధోరణులకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, రకరకాల కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించడం వంటి వ్యవహారాలు ఒక ఎత్తు అయితే.. చివరికి తెలుగుదేశం పార్టీ జెండా గద్దెలను కూడా కూల్చడం, కబ్జా చేయడం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకున్నట్టుంది. కర్నూలు జిల్లాలో ఇలాంటి సంఘటనే స్థానికంగా ఇరువర్గాల మధ్య వివాదానికి కారణమైంది. జెండా గద్దెలను కబ్జా చేసినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేయడం సాధ్యమవుతుందా? అని విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ప్రాభవానికి గండికొట్టే కుటిల ప్రయత్నాలు ఎన్నెన్ని జరిగాయో లెక్కేలేదు. గ్రామాలలో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టుకుని ఉంటే రాత్రికి రాత్రి వాటినికూలగొట్టడం వంటివి అనేకం జరిగాయి. కొన్ని చోట్ల అధికారికంగా కూడా రోడ్ల వెడల్పు పేరుతో విగ్రహాలను తొలగించిన సంఘటనలున్నాయి. ప్రజల నుంచి ఎంత ప్రతిఘటన వస్తున్నప్పటికీ విగ్రహాల తొలగింపు చేశారే తప్ప.. వాటిని తిరిగి మరో చోట ప్రతిష్ఠించడం వంటివి అస్సలు పట్టించుకోలేదు. తెలుగుదేశం నాయకుల ఇళ్లను, ఆస్తులను కూలగొట్టడం కూడా విగ్రహాలకు కొనసాగింపులాగానే జరుగుతూ వచ్చింది. అలాంటి దురాగతాలతోచెలరేగుతున్న వైసీపీ నాయకులు.. తెలుగుదేశం పార్టీ జెండా గద్దెలను కూలగొట్లడం, జెండాలను తొలగించడం వంటివి కూడా అనేకం చేస్తూ వచ్చారు.
వీటికి కొనసాగింపు అన్నట్టుగా.. కర్నూలు జిల్లా మాధవరంలో తాజాగా మరో సంఘటన జరిగింది. మాధవరం నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న తెలుగుదేశం జెండాను వైసీపీ నాయకులు తొలగించారు. సంగతి తెలిసి అక్కడకు తెలుగుదేశం నాయకులు చేరుకుని వారిని నిలదీయడంతో, మరింత రెచ్చిపోయి జెండా పైపును కూడా తొలగించేశారు. జెండా గద్దెకు వైసీపీ పార్టీ రంగులు వుేసేశారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోడానికి చూసిన తెలుగుదేశం నాయకులను మాత్రం పోలీసులు స్టేషనుకు తరలించడం గమనార్హం.
అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు పార్టీ ఎందుకు పాల్పడుతున్నదో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. వైసీపీలో ఓటమి భయం ఉన్నదని, అందుకే ప్రత్యర్థి పార్టీ జెండాను తొలగించడం వంటి ఆకతాయి పనులు చేస్తున్నారని అంటున్నారు. జెండాను తొలగించడం కాదని, ప్రజల హృదయాలలో పార్టీని తొలగించడం జెండాను తీసేసినంత ఈజీగా కుదురుతుందా? అనే ప్రశ్న కూడా ప్రజల నుంచి వినిపిస్తోంది

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles