ఆయనను ఎప్పటికీ 16 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచారు. రెండు రోజులపాటు సిఐడి కస్టడీ విచారణకు కూడా అనుమతించారు. విచారణలో అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా స్పష్టంగా ఆయన సమాధానం చెప్పారు. పత్రికలలో వస్తున్న వార్తల ప్రకారం గమనించినట్లయితే.. అడిగిన ప్రతి ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పిన తర్వాత.. ఇంకా ఏం ప్రశ్నలు అడగాలి అనేందుకు, అధికారుల వద్ద విషయం లేకుండా పోయిందని.. ఆయనను విచారణలో కూర్చోబెట్టి, ఏం అడగాలనే విషయంలో అప్పుడు వాళ్ళు ఫైళ్లు వెతుక్కున్నారని తెలుస్తోంది. ఇంత జరిగినా సరే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండును అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించడం ఆశ్చర్యకరంగా ఉంది.
సాధారణంగా విచారణ ఇంకా మిగిలి ఉన్నట్లయితే, విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సరిగా సహకరించకపోయినట్లయితే.. వారి రిమాండ్ ను పొడిగించాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు నాయుడు విషయంలో అలా జరగలేదు. ఆయనను ఏకంగా ఐదు రోజుల కస్టడీ విచారణకు అప్పగించాలని సిఐడి అధికారులు కోర్టును కోరారు. కానీ కోర్టు కేవలం రెండు రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ విచారణ పర్వంపై వస్తున్న వార్తలను గమనిస్తే, రెండు రోజులు పాటు ప్రశ్నించడానికే వారి వద్ద విషయం లేకుండా పోయిందని అర్థం అవుతోంది.
చంద్రబాబు నాయుడు నేరుగా సిఐడి అధికారులతోనే.. ‘‘నన్ను ఎక్కడ తప్పు పట్టాలో మీకే స్పష్టంగా తెలియదు. అందుకే ఇక్కడికి వచ్చి ఫైళ్లు వెతుక్కుంటున్నారు’’ అని అన్నట్లుగా కూడా తెలుస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో రెండేళ్ల కిందటే కేసు నమోదు చేశారు. అప్పటినుంచి దీనితో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులను విచారించారు. 17 రోజుల కిందట చంద్రబాబును అరెస్టు చేసి ఒకరోజు విచారించారు. కస్టడీలోకి తీసుకొని ఇంకో రెండు రోజులు విచారించారు. కూడా తనను తప్పు పట్టడానికి సిఐడి వద్ద ఆధారాలు లేకుండా పోయాయని చంద్రబాబు నాయుడు పేర్కొనడం. ఈ ఎపిసోడ్ మొత్తం, నిరాహార ఆరోపణలతో చంద్రబాబు నాయుడును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేశారని అనుకోవడానికి అనుకూలంగా ఉంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా సరే హాజరుకావడానికి అందుబాటులో ఉండే వ్యక్తి అయినప్పటికీ, విచారణకు హాజరు కావడానికి ఆయనేమీ అభ్యంతరాలు చెప్పకపోతున్నప్పటికీ.. రిమాండ్ ను పొడిగించడం అనేది ఆశ్చర్యకరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.