జాక్‌ ఓటీటీ విడుదల ఎప్పుడంటే!

Monday, December 8, 2025

సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన సినిమా ‘జాక్’ తాజాగా ఓటీటీ వేదికపై అందుబాటులోకి రాబోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. వేసవి స్పెషల్ రిలీజ్‌గానే ప్రేక్షకుల ముందుకొచ్చినా, పెద్దగా కలెక్షన్లు రాబట్టలేక పోయింది. అయితే ఇప్పుడు ఇది డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌పై మరోసారి లక్క్ ట్రై చేయబోతుంది.

మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఇది విడుదల కాబోతుండటం విశేషం. అంటే ప్రాంతీయ భాషల ప్రేక్షకులందరినీ లక్ష్యంగా పెట్టుకుని సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సిద్ధూ తన పాత్రలో చాలా ఎనర్జిటిక్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించాడు. యాక్టింగ్‌కి తోడు అతని కామెడీ టైమింగ్ సినిమాలో స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. వైష్ణవి చైతన్య కూడా తన పాత్రలో తగిన స్థాయిలో జెరిగింది. వీళ్లిద్దరి మధ్య కొన్ని సీన్లు సరదాగా, ఎంటర్టైనింగ్‌గా నడిచాయి.

థియేటర్లలో ఫలితం ఆశించినంతగా లేకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా ‘జాక్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉంది.

మీరు ఇంకో సినిమా కోసం చూస్తుంటే, మే 8 తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూసేయండి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles