మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చే సినిమాలు చేసే ఎన్టీఆర్ ఇప్పుడు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి మొదటి నుండి పెద్ద హైప్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా ఇటీవలే షూటింగ్లో చేరాడు. ఆయన యాక్షన్ సీన్లు తీయడం కోసం టీమ్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సెట్స్ వేసి షూట్ చేస్తున్నట్టు సమాచారం.
ఇంత స్ట్రిక్ట్‌గా పని చేస్తున్నప్పటికీ షూటింగ్‌కు బ్రేక్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్‌తో కలిసి తమ కుటుంబాలకు టైమ్ కేటాయిస్తున్నారు. రీసెంట్గా వీళ్లిద్దరూ తమ భార్యలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఈ పర్సనల్ మోమెంట్స్‌ను చూస్తూ ఆనందపడుతున్నారు.
ఇక చిత్ర యూనిట్ నుంచి ఈ ఫ్యామిలీ క్లిక్‌లు బయటకు రావడంతో పాటు, మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా షేర్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ప్రశాంత్ నీల్ స్టైల్ మాస్ యాక్షన్‌కి ఎన్టీఆర్ ఎనర్జీ కాంబినేషన్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.