జగన్ ఆనందం ఆవిరి అయిపోతున్న వేళ..!

Thursday, December 4, 2025

‘జగన్ 2.0 వచ్చిన వెంటనే, వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి పార్టీలకు చెందిన వారందరినీ.. గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టుగా రప్పా రప్పా నరుకుతాం’ అంటూ రెచ్చగొట్టే ప్రకటనల ఫ్లెక్సిలను చేతబట్టుకుని జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో చాలా మందే కనిపించారు. కేవలం ఒక్ రవితేజ మాత్రమే కాదు. ఇంకా అనేకమంది కూడా ఇదే ఫ్లెక్సిలతో రెచ్చిపోయి వ్యవహరించారు.. డ్యాన్సులు చేశారు. నినాదాలు చేశారు. ప్రస్తుతానికి రవితేజ మాత్రమే పోలీసులకు దొరికాడు. మిగిలిన వారు కూడా రేపో మాపో! పోలీసులనుంచి తప్పించుకోవడం కష్టం.

అయితే రవితేజ అనే వ్యక్తి పేరుతో తెలుగుదేశం సభ్యత్వ కార్డు ఉన్నదని తెలియగానే జగన్మోహన్ రెడ్డి తెగ మురిసిపోయారు. రవితేజ తెలుగుదేశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. ఆయనకే చంద్రబాబు పాలన నచ్చలేదని.. అందుకే మనకు అభిమానస్తుడిగా మారి.. మన ర్యాలీలో పాల్గొన్నారని.. తెలుగుదేశానికి చెందిన వ్యక్తే.. తెలుగుదేశం వారినే రప్పారప్పా నరుకుతానని అంటూ ఉంటే మంచిదే కదా ఆనందమే కదా’ అని వంకర భాష్యాలు చెప్పి పరవశించిపోయారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన పరవశానికి అప్పుడే ఎండ్ కార్డు వేయాల్సి వచ్చేలాగా ఉంది. అలాంటి రెచ్చగొట్టే పోస్టరు పట్టుకున్నందుకు అరెస్టు అయిన రవితేజ.. తెలుగుదేశం సభ్యత్వ కార్డు కలిగిఉన్నప్పటికీ.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడే అని తాజాగా వివరాలు బయటకు వస్తున్నాయి. 88 త్యాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజ.. ఎన్నడూ తెలుగుదేశం కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి కానే కాదని.. వైసీపీ వారి కేటరింగ్ వ్యాపారంలో పనిచేస్తుంటాడని స్థానిక తెలుగుదేశం నాయకులు అసలు గుట్టు బయటపెట్టారు. పెదకూరపాడు అసెంబ్లీ వైసీపీ ఇన్చార్జి మనోహర్ నాయుడుతో కలిసి రవితేజ దిగిన ఫోటోను కూడా వారు మీడియాకు విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే కొన్ని అదనపు ప్రయోజనాలు దక్కుతాయనే ఉద్దేశంతో మాత్రమే.. రవితేజ తల్లిదండ్రులు కోరినందున అతడికి సభ్యత్వం ఇచ్చినట్టుగా వారు వెల్లడించారు. ఇంకా అనేకమంది వైసీపీ కార్యకర్తలు కూడా తమ గుట్టు తెలియనివ్వకుండా తెదేపా సభ్యత్వ కార్డులు తీసుకుని ఉన్నట్టుగా ఆయన చెబుతున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వాడికి తెలుగుదేశం సభ్యత్వకార్డు ఉన్నదని తెలియగానే జగన్మోహన్ రెడ్డి తెగ మురిసిపోయారు. అక్కడికేదో తెలుగుదేశం కార్యకర్తలందరూ తనర్యాలీల్లోకి వచ్చేస్తున్నట్టుగా.. తెలుగుదేశం బలం మొత్తం తన పార్టీకి వచ్చేస్తున్నట్టుగా ఆయన సంతోషించారు. కానీ.. ఇదంతా కూడా తెలుగుదేశం వల్ల దక్కే ప్రయోజనాల కోసం ఆయన అభిమానులు కూడా అక్కడ సభ్యత్వం తీసుకుంటున్న డ్రామా ఫలితం అని తేలిపోయింది. తెలుగుదేశం తరహాలో తాను సొంత పార్టీ కార్యకర్తలకు సదుపాయాలు కల్పించలేకపోతున్నందుకు ఆయన సిగ్గుపడతారా లేదా వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles