వివేకా హత్య కేసు మరింతగా నీరుగారిపోతున్నదా?

Thursday, December 4, 2025

సాక్షాత్తూ వైఎస్ రాజశేఖర రెడ్డికి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే ఆరేళ్లుగా ఆ కేసుకు అతీ గతీ లేదు. ఆయన కుమార్తె సునీత ఇవాళ్టి దాకా తన తండ్రిని చంపిన వారెవ్వరో తేల్చాలని, వారికి శిక్షలు పడేలా చూడాలని కోరుతూ న్యాయపోరాటం సాగిస్తున్నారు. ఆమెకు అనుకూలంగా ఇప్పటిదాకా జరిగిన ఏకైక పరిణామం.. హత్యచేసినది ఆమేననే కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడం. అంతకుమించి.. ఈ కేసులో మరో అడుగు పడడం లేదు. ఒకవైపు ఇప్పటిదాకా, ఎంపీ అవినాష్ సహా అనేకమంది నిందితులు పొందిన బెయిళ్లను రద్దు చేయాలని ఆమె సుప్రీంలో కేసు నడుపుతుండగా.. హత్య కేసులో ఏ1 నిందితుడికి కూడా కొత్తగా బెయిలు రావడం కీలకంగా కనిపిస్తోంది. పరిణామాలను గమనిస్తోంటే.. వివేకా హత్య కేసును నెమ్మదిగా నీరుగారుస్తున్నారనే సందేహం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే..

వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు గంగిరెడ్డి తాజాగా సుప్రీం కోర్టులో బెయిలు లభించింది. ఈ బెయిలు పిటిషన్ వాదనల సందర్భంగా న్యాయమూర్తిని ఒప్పించిన, గంగిరెడ్డి న్యాయవాది దామా శేషాద్రి నాయుడు మాటలు ఆసక్తికరం. ఈ కేసులో చాలా మంది నిందితులకు ఆల్రెడీ బెయిలు మంజూరు అయిందని, గంగిరెడ్డి ఒక్కరినే లోపల ఉంచడం సమంజసం కాదని అన్నారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించి బెయిలు ఇచ్చేశారు. ఈ తాజా పరిణామంతో వివేకా హత్యకేసు నిందితులందరూ ఇప్పుడు బయటకు వచ్చినట్టే.

‘చాలామంది’ బెయిలుపొందారు అని చెప్పడంలో.. వారిలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి, ఆయన సహచరుడు శివశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ తదితరులు అందరూ ఉన్నారు. ఒకవైపు వీరందరి బెయిళ్లను రద్దు చేయాలంటూ సునీత సుప్రీంలో పిటిషన్ నడుపుతుండగా.. అది సెప్టెంబరు 9నాటికి వాయిదా ఉంది. ఎందరి బెయిళ్లు రద్దు చేయవచ్చునో చెప్పాలని సుప్రీం సీబీఐను ఆదేశించడంతో, వారి బెయిళ్లు రద్దు కావొచ్చుననే ఆశలు సునీత వర్గంలో ఏర్పడింది. కానీ ఇప్పుడు గంగిరెడ్డికి కూడా బెయిలు వచ్చింది.

ఈ బెయిలురద్దు పిటిషన్ లో ఇప్పుడు సునీత గంగిరెడ్డి పేరును కూడా చేర్చాల్సి వస్తుంది. అందరికీ బెయిలు వచ్చిన తర్వాత.. సుప్రీంలో వాదనల సందర్భంగా.. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీం కోర్టుకు గతంలోనే నివేదించి ఉన్న నేపథ్యంలో నెమ్మదిగా ఈ కేసు విచారణ నీరుారుతున్నదా అనే అనుమానం పలువురికి కలుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles