బాబుకు అండగా నిలిస్తే.. బురద చల్లుడే!

Friday, September 20, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అలవాటు అయిన వక్ర రాజకీయ నీతిని పుష్కలంగా అనుసరిస్తోంది. చంద్రబాబునాయుడును రాజకీయ కక్షసాధింపుకోసం అరెస్టుచేసి, జైలు నుండి బయటకు రానివ్వకుండా కేసుల మీద కేసులు పెడుతున్నారని ఒకవైపు రాజకీయవర్గాల్లోను, ప్రజల్లోను చర్చ జరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబు పట్ల సానుభూతి, జాలి కూడా పెరుగుతూ వస్తున్నాయి. వైసీపీ వైఖరి కక్ష సాధింపుగా ఉన్నదనడంతోపాటు, జగన్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వారినందరినీ కూడా ఆత్మరక్షణలో పడేయడానికి, వారి మీద భిన్నమైన మార్గంలో బురద చల్లడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబుకు ఎవ్వరు అండగా నిలిచినా సరే, ఆయనకు అనుకూలంగా ఎవరు గళం విప్పినా సరే.. వారికి ఆయన అవినీతిలో భాగం ఉన్నదని బురద చల్లేలా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు.

దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్రబీజేపీ సారథ్యం స్వీకరించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మద్యం, ఇసుక వ్యాపారాల్లో జరుగుతున్న అక్రమాలను, అవినీతిని ఆమె తీవ్రస్థాయిలో ఎండగడుతున్నారు. ఒక్క లిక్కర్ వ్యాపారంలోనే ఏటా సుమారు 30 వేల కోట్ల రూపాయలు వైసీపీ పెద్దలు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్దకెళ్లి.. రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ వ్యాపారం మీద సీబీఐ విచారణ సాగించాలంటూ విజ్ఞప్తి చేశారు. అదే జరిగితే గనుక.. వైసీపీ సర్కారు బండారం మొత్తం బయటపడుతుందనడంలో సందేహం లేదు. 

దానికి తోడు.. చంద్రబాబునాయుడు అరెస్టుకు సంబంధించి.. నారాలోకేష్ తో అమిత్ షా భేటీ కావడం వెనుక పురందేశ్వరి ప్రమేయం ఉన్నదనే పుకార్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు అరాచకంగా జరిగిందని వ్యాఖ్యానించిన పురందేశ్వరి, ఇప్పుడు ఆ గొడవ అమిత్ షా దృష్టికి వెళ్లడానికి కూడా తోడ్పడ్డారు. 

ఈ నేపథ్యంలో భువనేశ్వరిని డిఫెన్సులో పడేయడానికి.. చంద్రబాబునాయుడు అవినీతిలో ఆమెకు కూడా వాటా ఉన్నదని విజయసాయిరెడ్డి అభివర్ణించడం గమనార్హం. ఆమెను యెల్లో లోటస్ అని పేర్కొంటూ విజయసాయి ఎద్దేవా చేస్తున్నారు. చూడబోతే.. చంద్రబాబు మంచివాడని ఎవరు అంటే వారి మీద – అవినీతిలో భాగస్వాములనే బురద చల్లడానికి విజయసాయి ప్రయత్నిస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన చంద్రబాబు అరెస్టును ఖండించిన మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్లకు కూడా అవినీతి, వాటాలతో ముడిపెడతారా అనేది పలువురి ప్రశ్న. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షాలను కూడా బాబు అవినీతిలో వాటాదారులని అనగల ధైర్యం విజయసాయికి ఉన్నదా అని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles