భూమన ఓవరాక్షన్ కు చెక్ పెట్టిన టీటీడీ!

Thursday, December 4, 2025

టీటీడీలోని అన్ని విభాగాలలో తన మనుషులు ఉన్నారని, ఎక్కడ ఏం జరిగినా సరే తనకు తెలిసిపోతుందని, టీటీడీ యాజమాన్యాన్ని నిలదీస్తూ తాను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానని.. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గతంలో పలుమార్లు చెప్పుకున్నారు. రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా కూడా పనిచేసిన భూమున కరుణాకర్ రెడ్డి దాదాపుగా అన్ని విభాగాలలోనూ అప్పట్లో తన ఏజెంట్లను నియమించుకుని ఉండడం పెద్ద విశేషమేమీ కాదు.

తప్పులు జరిగితే నిలదీస్తే మంచిదే. భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం అలాంటి సద్బుద్ధితో కాకుండా, ఏం జరిగినా సరే దానిని తప్పు కింద ప్రొజెక్ట్ చేస్తూ బురద చల్లాలని, విషం చిమ్మాలని ప్రయత్నించడమే అసహ్యంగా ఉంది. భూమన చాలా తరచుగా చేస్తూ ఉండే ఇలాంటి అసహ్యకరమైన ఓవరాక్షన్ కు చెక్ పెట్టే విధంగా టీటీడీ ఇవాళ వ్యవహరించింది. టీటీడీ పట్ల భక్తులలో అపోహలు ఏర్పడేలాగా విషపూరితమైన దుష్ప్రచారానికి పాల్పడినందుకు అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. టీటీడీ ఇంజినీరు గోవిందరాజులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసుల నమోదు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..

తిరుపతిలో అలిపిరి వద్ద శిల్పకళ శిక్షణ కేంద్రం కూడా ఉంటుంది. శిల్పులందరికీ అక్కడ క్వార్టర్లు కూడా ఉంటాయి. బయటి ప్రాంతాల వారికి కూడా ఆర్డర్ల మీద ఇక్కడ శిలలను చెక్కి విక్రయిస్తుంటారు. శిలలను చెక్కే చోట, చెక్కే ప్రాసెస్ లో ఏవైనా కొన్ని దెబ్బతింటే గనుక వాటిని నిరుపయోగంగా పక్కన పడేయడం సర్వసాధారణమైన విషయం. అదే మాదిరిగా ఒక విగ్రహాన్ని అలిపిరి వద్ద ఉండే శిల్పుల క్వార్టర్స్ సమీపంలోని ఖాళీ జాగాలో వదిలేశారు. ఇది నిన్నామొన్నా జరిగిన వ్యవహారం కానే కాదు. దాదాపు 10 ఏళ్లకు పైగా ఆ దెబ్బతిన్న విగ్రహం అదే స్థలంలో పడి ఉంది.

తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి కి దీని గురించి ఆయన ఏజెంట్లు ఎవరో సమాచారం ఇచ్చినట్లుగా ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడడానికి అవతరించిన మూర్తిగా తనను తాను చాటుకునే కరుణాకర్ రెడ్డి యెకాయెకీన అక్కడకు వచ్చేసారు. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైన శంఖచక్రాలు ఉన్నటువంటి విగ్రహాన్ని మలమూత్రాలు, మద్యం సీసాలు, పారవేసి ఉండే ప్రాంతంలో చాలా ఘోరమైన స్థితిలో ఉంచారు- అంటూ ఆయన మొసలి కన్నీరు కార్చారు. తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం ఈ రకంగా దైవ ద్రోహం చేస్తున్నదంటూ నిందలు వేశారు.

నిజానికి ఆ దెబ్బతిన్న విగ్రహం అదే స్థలంలో గత పదేళ్లుగా పడి ఉన్నదనే సంగతి అప్పటికి ఆయనకు తెలియదో, తెలియనట్టుగా నటించారో అర్థంకానిసంగతి. గతంలో ఆయన బోర్డు సభ్యుడుగా ఉన్నప్పుడు, బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసినప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడే ఉంది. ఈ సంగతి ఆయన స్పృహలో లేదు. టీటీడీ మీద బురద చల్లడానికి ఒక అవకాశం కలిసి వచ్చింది కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోయారు.

ప్రతిసారి భూమన బురద చల్లడం ప్రతి విమర్శలు చేసి ఊరుకోవడం జరుగుతూ వస్తోంది. కానీ ఈసారి టీటీడీ సీరియస్ నిర్ణయం తీసుకుంది. భక్తులలో అపోహలు సృష్టించే లాగా ఎవరైనా దుష్ప్రచారాలకు పాల్పడితే వారి మీద క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తాం అంటూ ఇదే రోజున జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. సాయంత్రానికి భూముల కరుణాకర్ రెడ్డి సాగిస్తున్న విషప్రచారం మీద అలిపిరి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు అయింది.

టీటీడీ ఇంజినీర్ గోవిందరాజులు ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసులను పెట్టారు పోలీసులు. మొత్తానికి ఈ క్రిమినల్ కేసు క్రిమినల్ కేసులు పెట్టడం ద్వారా భూమన కరుణాకర్ రెడ్డి వంటి వ్యక్తుల దుర్మార్గాలకు టీటీడీ చెక్ పెట్టిందని అనుకోవాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles