వైసీపీకి ఆరా సర్వే జై : అసలు సీక్రెట్ ఇదే!

Friday, July 5, 2024

ఎన్నికల సీజను వచ్చిందంటే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంటూ హడావిడి చేసే వారికి పండగే. దారినపోయే దానయ్యలు కూడా ఒక సర్వే సంస్థ పేరుతో విజిటింగ్ కార్డులు కొట్టించుకుని ఎంతో కొంత యాపారం చేసుకోవడానికి చూస్తుంటారు. ఫలానా పార్టీ, పలానా నాయకుడు గెలవబోతున్నాడంటూ పోలింగుకు ముందు ప్రకటనలు చేయడానికి కొన్ని రేట్లు నిర్ణయించుకుని వారు వ్యాపారం చేస్తుంటారు. వారి సర్వే నివేదికల్ని ప్రజలు నమ్ముతారని కాదు గానీ.. పార్టీలు మాత్రం తమకు అనుకూలంగా చెప్పిన సర్వే ఫలితాలను అదేపనిగా ప్రచారం చేసుకుంటూ.. గెలవబోతున్నది మేమే అని డప్పుకొట్టుకుంటాయి. వీటిలో చాలా వరకు ఎన్నికల ముందు పుట్టి, తర్వాత అంతరించి పోయే సంస్థలు కూడా ఉంటాయి.
అయితే ప్రస్తుతం ఉన్న సర్వే సంస్థల్లో దశాబ్దానికి పైగా నిలకడైన పెర్ఫార్మెన్స్ తో కాస్త పేరున్న వాటిలో ఆరా కూడా ఒకటి. వారి అంచనాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగానే ఉంటాయనే పేరుంది. తెలంగాణ విషయానికి వస్తే భారాసకు సున్న సీట్లు వస్తాయనే అంచనాతో పాటు, భాజపా లీడ్ లో ఉంటుందనే వాదనతో వారు నమ్మదగిన అంచనాలనే వెల్లడించారు. ఆరాను మాత్రమే నమ్మడం అని కాదుగానీ.. అక్కడ దాదాపుగా అన్ని రెప్యూటెడ్ సంస్థలు అలాగే చెబుతున్నాయి.
ఏపీ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఆరా మాదిరిగానే అంచనాలు చెబుతున్న సంస్థలన్నీ, ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తుందని చెబుతుండగా.. ఆరా మాత్రం వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంటోంది. ఇది చిత్రమైన పరిణామం. వైసీపీకి అధికారం తథ్యం అని మూడు సంస్థలు అంటుండగా.. ఆరా తప్ప మిగిలిన రెండూ ఊరూపేరూ లేని సంస్థలు. వాటిని పక్కన పెడితే.. ఆరా కూడా ఇలా చెప్పడం వెనుక ఒక సీక్రెట్ ఉన్నదని విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఆరా సంస్థ యజమాని మస్తాన్.. ఈ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ కావాలని చంద్రబాబునాయుడును అడిగాడని బాగా వినిపిస్తోంది. అయితే సుదీర్ఘకాలంగా వైసీపీ నాయకులకు అనుకూలంగా ఉంటాడనే పేరున్న మస్తాన్ కు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారని, దీంతో తెలుగుదేశం ఓడిపోతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. బహుశా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉంటే.. తెదేపా ఘనవిజయం అని చెప్పేవారేమో అంటున్నారు కూడా.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles