వైభవం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది!

Friday, September 27, 2024

కొత్త నటీనటులు రుత్విక్, ఇక్రా ఇద్రిసి ప్రధాన పాత్రల్లో రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమా  “వైభవం”. యువ ప్రతిభాశాలి సాత్విక్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలోని ‘పల్లె వీధుల్లోన’ పాటను మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

మరి చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని గుర్తుచేసే ఈ పాటకు దర్శకుడు సాత్విక్ స్వయంగా సాహిత్యాన్ని, బాణీలను అందించాడు.  రితేష్ జి రావు పాడారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles