‘దేవర’ రెస్పాన్స్‌కి తారక్ ఏమని ట్విట్‌ చేశాడంటే!

Sunday, October 13, 2024

టాలీవుడ్‌ ప్రెస్టీజియస్ సినిమా దేవర…నేడు ఎంతో గ్రాండ్‌ గా థియేటర్లలోకి వచ్చేసి ప్రేక్షకులను అలరిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ , యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌  నటించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన తీరుకు అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

తొలిరోజే ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీలో ఉంది. తాజాగా ‘దేవర’కు వస్తున్న రెస్పాన్స్‌పై హీరో ఎన్టీఆర్ స్పందించాడు. ‘‘ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మీ రెస్పాన్స్‌ని చూస్తుంటే చాలా సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను.

ఇలాంటి ఎంగేజింగ్ డ్రామా, ఎమోషన్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించిన కొరటాల శివకి స్పెషల్‌ థ్యాంక్స్. అనిరుధ్ సంగీతం ఈ కథకు ఓ బ్యాక్‌బోన్‌లా నిలిచింది. అభిమానులు ఈ సినిమాను ఆదరిస్తున్న తీరుకి అభిమానులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. వారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.’’ అంటూ తారక్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

ఇక ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ని  రాబడుతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా తొలిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టే దిశగా దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles