తేజా సజ్జా చేతికి గాయం!

Sunday, December 22, 2024

హనుమాన్ సూపర్ హిట్ తో తేజ సజ్జా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే జోష్ లో తేజ సజ్జా ‘మిరాయ్‌’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాడు. ఈగల్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని ‘మిరాయ్‌’ కు డైరెక్షన్‌ చేస్తున్నాడు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా, విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. మిరాయ్ యూనిట్ ఇటీవల శ్రీలంక షెడ్యూల్ లో షూట్ పూర్తి చేసుకుంది. హీరో తేజపై యాక్షన్ ఎపిసోడ్స్ ను షూట్ చేస్తున్నారు. అందుకు సంబందించి రెండు రోజుల క్రితం ఓ వీడియో బయటకు వచ్చింది.

ఆ వీడియోలో ఎటువంటి డూప్ లేకుండా ట్రైన్ పై యాక్షన్ సీక్వెన్స్ లో తేజా సజ్జా ఫైట్స్ చేస్తున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా  హీరో తేజా సజ్జా శ్రీలంక షెడ్యూల్ ముగించి హైదరాబాద్ కి వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుండి వస్తున్న విజువల్స్ లో తేజా ఎడమ చేతికి కట్టు ఉన్న పిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయమై ఆరా తీయగా మిరాయ్ షూట్ లో తేజ సజ్జా గాయపడినట్టు తెలుస్తోంది. మిరాయ్‌ 8 భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles