బఘీర..మరో సలార్‌!

Saturday, December 7, 2024

కన్నడ సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ శ్రీ మురళీ హీరోగా వస్తోన్న మూవీ ‘బఘీర’. డా. సూరి డైతెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ ని ప్రశాంత్ నీల్ అందించాడు. గతంలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ నే బఘీర సినిమాను కూడా నిర్మించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించినట్టు తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ ని పరిశీలించినట్టయితే. అమ్మ దేవుడు ఎందుకు రామాయణం, మహాభారతం అని ఎప్పుడో ఓ సారి వస్తాడు. ఎప్పుడు ఎందుకు రాడు…అంటూ ఓ చిన్న పిల్లాడు తన తల్లిని అడగగా…. ఆ తల్లి బదులుగా సమాధానం ఇస్తూ దేవుడు అన్నిసార్లు రాడు. సమాజంలో పాపాలు మితిమీరినప్పుడు, మంచిని చెడు తొక్కేసినప్పుడు, సమాజంలో కుళ్లు పెరిగినప్పుడు, మనుషులు మృగాళ్లు అయినప్పుడు ఆయన అవతారమెత్తుతాడు అని చెప్తూ ట్రైలర్ ను రన్‌ చేశారు.

ట్రైలర్ చూస్తుంటే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. బహుశా ప్రశాంత్ నీల్ కథ అందించినందుకు ఏమో ట్రైలర్ లో కేజీఎఫ్, సలార్ షేడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రశాంత్ నీల్ స్టైల్ బొగ్గు, గన్స్ వంటివి ట్రైలర్ లో నింపేశారు. అజనీష్ లోకానాధ్ సంగీతం ఆకట్టుకుంది. ఫైట్స్ వేరే లెవల్ లో ఉన్నాయి. దీపావళి కానుకగా  ఈనెల 31న ‘బఘీర’ థియేటర్లలోకి రానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles