ఎగ్జిట్ పోల్స్ గానీ, వివిధ సంస్థలు వెల్లడించే ఫలితాలు గానీ ఎలా ఉంటాయనేది అంత ప్రధానంగా పట్టించుకోవాల్సిన అంశం కానే కాదు. ఎందుకంటే.. సంస్థల్లో కంటె ప్రజల్లోనే అసలు ‘పల్స్’ కరెక్టుగా బయటకు వస్తుంది. పోలింగ్ తర్వాత బెట్టింగ్ రాయుళ్ల ధోరణిలోనే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో సంకేతాలు అందుతుంటాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత.. బెట్టింగ్ ప్రపంచం మరింత ఉధృతంగా పందేలు కాస్తోంది. ప్రత్యేకించి తెలుగుదేశానికి అనుకూలంగా పందేలు కాస్తున్న వారు.. ఒక్కసారిగా టాప్ గేర్ లోకి వెళుతున్నారు.
మొన్నటిదాకా బెట్టింగ్ ల మీద పార్టీల అభిమానులు కాసిన పందేలు ఒక తీరుగా సాగాయి. ఇప్పుడు మరొక తీరుగా సాగుతున్నాయి. బెట్టింగ్ లు అనేవి క్రికెట్ బెట్టింగుల స్థాయిలో ఒక వ్యవస్థీకృత నేరంలాగా సాగడం ఒకవైపు జరుగుతూ ఉంటుంది. పట్టణాల్లో, మిత్రుల సమూహాల్లో విడివిడిగా బెట్టింగులు వేసుకుంటూ ఉండడం మరో ఎత్తు. ఫరెగ్జాంపుల్.. మొన్నటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఓ లక్ష పందెం కాశారంటే దాని అర్థం.. చంద్రబాబు గెలిస్తే వాళ్లు లక్ష రూపాయలు కోల్పోతారన్నమాట. అయితే తెలుగుదేశం నాయకులు ‘ఒకటికి ఒకటిన్నర’ అనే దామాషాలో పందేలు కాశారు. అంటే జగన్ గెలిస్తే లక్ష పందేనికి లక్షన్నర రూపాయలు వారు ఇచ్చుకుంటారన్నమాట. ఈ ఉధృతి నిన్నటిదాకా సాగింది.
ఎగ్జిట్ పోల్స్ వెల్లడైన తర్వాత.. తెలుగుదేశం వారిలో ఇంకాస్త జోష్ పెరిగింది. ‘ఒకటికి రెండు..’, ‘ఒకటికి రెండున్నర..’ అంటూ బెట్టింగ్ పాటను పెంచేస్తున్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అనేక సంస్థలు విస్పష్టంగా తేల్చి చెబుతుండడంతో.. ఆయన అభిమానులైన బెట్టింగ్ రాయుళ్లు.. తాము నెగ్గకపోతే రెట్టింపు ఇస్తాం అంటూ పందేలకు దిగడం జరుగుతోంది.
బెట్టింగ్ అనేది చాలా దుర్మార్గమైన వ్యసనం. అక్రమార్జేనలు, సంపదలతో తులతూగుతూ ఉండేవారికి వచ్చే నష్టం ఏమీ ఉండదు గానీ.. ఈ మాయలో పడి సామాన్యులు, మధ్యతరతగి వారు కూడా తమ జీవితాలను సర్వనాశనం చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఈ బెట్టింగ్ రాయుళ్లలో కనిపించే ధీమా, విశ్వాసాలే ఒక రకంగా రాబోయే ఎన్నికల ఫలితాలకు సంకేతాలు అని కూడా అనుకోవాల్సి వస్తోంది.
కాయ్ రాజా..’ పాటల్లో గేరు మార్చిన తెలుగుదేశం!
Sunday, December 22, 2024