సంక్రాంతికి దిగేది కొడుకే!

Tuesday, January 21, 2025

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సెన్సేషనల్‌ కోలీవుడ్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా గేమ్‌ ఛేంజర్‌.  ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌ గా చేస్తోంది. ముందు ఈ మూవీని డిసెంబ‌ర్‌లో క్రిస్టమస్‌ కానుకగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యంపై చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు అయితేసినిమా గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్టమస్‌ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని భావించారు.

కానీ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నప్పుడు క్రిస్టమస్‌ కంటే సంక్రాంతికి అయితే బాగుంటుందని నాతో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్, క‌ర్ణాట‌క‌ ఓవ‌ర్ సీస్‌లోని ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ అనుకున్నారు. ఈ ఆలోచ‌న‌ను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ సంస్థకు తెలియ‌జేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నామ‌ని వివరించారు. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభ‌ర‌’ సినిమా కూడా భారీ బ‌డ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వ‌స్తున్నట్లు అనౌన్స్ చేశారు.

అందువ‌ల్ల సంక్రాంతి తేదీ కావాల‌ని చిరంజీవిగారిని, యూవీ గారిని అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను సంక్రాంతికి రావ‌టానికి వాళ్ల విశ్వంభ‌ర సినిమాను మ‌రో తేదీకి విడుద‌ల చేయాల‌నుకున్నారు. నిజానికి విశ్వంభ‌ర సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ తో స‌హా మొత్తం పూర్తవుతుంది. అయితే నా కోసం, మా సినిమా కోసం వాళ్ల సినిమాను మ‌రో రిలీజ్ డేట్‌కు విడుదల చేయ‌టానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యూవీ క్రియేష‌న్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి నా ధ‌న్యవాదాలు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను సంక్రాంతి విడుద‌ల చేస్తున్నాం.

ఇటు అభిమానుల‌కు, అటు సినీ ప్రేక్షకుల‌కు న‌చ్చేలా సినిమాను తీసుకుని వచ్చేందుకు కష్టపడుతున్నాం. ఆల్ రెడీ రెండు పాట‌లు విడుద‌లయ్యాయి. రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి. రీసెంట్‌గా వ‌చ్చిన ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ యూ ట్యూబ్‌లో ఓ రేంజ్‌ లో మారుమోగిపోతుంది. త‌ర్వాత టీజ‌ర్ వ‌స్తుంది. త‌ర్వాత మ‌రో మూడు పాట‌ల‌ను రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్రమోష‌న‌ల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజ‌యం సాధించేలా ప్లాన్ చేశాం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles