కోహినూర్‌ తిరిగి తీసుకు వచ్చేద్దామా!

Friday, November 14, 2025

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో ఓ మూవీ వస్తుందంట, అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అందరికీ తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచి సంచలనాలు సృష్టించాయి. ఇప్పుడు చారిత్రాత్మక హ్యాట్రిక్ ని అందించడం కోసం ఈ కలయికలో ముచ్చటగా అద్భుతమైన మూడో సినిమా రానుంది.

విజయదశమి సందర్భంగా  భారతీయ సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఊహించని కథాంశంతో సినిమా చేస్తున్నట్లు  నిర్మాతలు ప్రకటించారు. “కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం” అనే సంచలన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.  వైవిధ్యమైన కథలు, పాత్రల ఎంపికతో అతి తక్కువ కాలంలోనే భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు సిద్దూ. ఇప్పుడు ఆయన తన తరువాత సినిమా కోసం  డైరెక్టర్‌ రవికాంత్ పేరెపుతో కలిసి వస్తున్నారు

టాలెంటెడ్ రచయిత-దర్శకుడు రవికాంత్‌ పేరెపు ‘క్షణం’ వంటి కల్ట్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించనున్నారు. సిద్ధు జొన్నలగడ్డతో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు, సిద్ధూ-రవికాంత్ కలిసి సరికొత్త కథాంశంతో సోషియో-ఫాంటసీ డ్రామాతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.

భద్రకాళి మాత మహిమగా నిలిచిన కోహినూర్ వజ్రం సామ్రాజ్యవాదుల చేతికి  వెళ్లిపోయింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాల్లోకి తీసుకురావడానికి యువకుడు సాగించే చారిత్రాత్మక ప్రయాణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. కోహినూర్ ను తిరిగి తీసుకురావడం అంత తేలికైన పని కాదు. కథాంశమే కాదు, కథాకథనాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండనున్నాయని సమాచారం. న్యాయంగా మనకు చెందాల్సిన వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చి, శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికి, చరిత్ర సృష్టించడానికి మన స్టార్ బాయ్ సిద్ధంగా ఉన్నాడు.

విభిన్నమైన, ప్రత్యేకమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం 2026 జనవరిలో థియేటర్లలోకి వస్తుందని, ఈ చిత్రంతో మరో ఐకానిక్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాని అత్యంత భారీస్థాయిలో, ప్రపంచస్థాయి సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles