రెట్రో కి సాలిడ్‌ ఓపెనింగ్స్‌!

Friday, December 5, 2025

స్టార్ హీరో సూర్య హీరోగా పూజా హెగ్డే కథానాయిక గా యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తీర్చిదిద్దన మోస్ట్‌ అవైటెడ్ సినిమా “రెట్రో”. అయితే సూర్య నుంచి ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది హిట్ గా నిలుస్తుంది అని అనుకున్నారు కానీ ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో ఫుల్ ఫ్లెడ్జ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. అయితే ఉన్న హైప్ లో మాత్రం డే 1 కి మంచి వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది.

మెయిన్ గా తమిళ రాష్ట్రంలో రెట్రో మంచి నెంబర్ అందుకుంది. పి ఆర్ లెక్కల ప్రకారం రెట్రో చిత్రం 17.75 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దీనితో సూర్య కెరీర్లో ఇది మరో బెస్ట్ ఓపెనింగ్ అన్నట్టు తమిళ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డే 2 నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సూర్య, జ్యోతికలు నిర్మాణం వహించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles