సత్య భామ విడుదల తేదీ ఫిక్స్!

Tuesday, June 25, 2024

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే తన స్నేహితుడిని వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకోని కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
 గతేడాది బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలతో బిజీ గా ఉంది. ఇదిలా ఉంటే కాజల్ నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా “సత్యభామ”..ఇందులో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ,సాంగ్స్ సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేశాయి.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇదిలా వుంటే ఈ సినిమా రిలీజ్ మే నెలాఖరున అంటే మే 31 ఉంటుందని అంతా భావించారు .తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.సత్య భామ మూవీ “జూన్ 7 ” న గ్రాండ్ గా విడుదల కానున్నట్లు ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles