వారెవ్వా సజ్జల : ఏమి ద్వంద్వ నీతి సారూ??

Friday, July 5, 2024

‘తాము చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం’ అనే కుటిల నీతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు అర్థం చేసుకున్నంత ఘాటుగా మరెవ్వరూ అర్థం చేసుకోలేదనే అనుకోవాలి. రాష్ట్రంలో ఇంచుమించుగా 80 శాతం వరకు ఓటింగు జరగబోతున్నది. ఇంకా పలుచోట్ల పోలింగు కొనసాగుతూనే ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారిక స్పందనను ఆయన సాయంత్రం ప్రెస్ మీట్ లో వెల్లడించారు. పైన చెప్పుకున్న సామెత ప్రకారంగా.. ఆయన ప్రదర్శించిన ద్వంద్వనీతి ఏమిటంటే.. 2019 ఎన్నికల్లో కూడా 79.8 శాతం వరకు పోలింగ్ జరిగింది. అప్పట్లో భారీ పోలింగు జరిగిన ప్రభావం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందిట. ఈసారి కూడా ఇంచుమించు అంతకుమించిన భారీ ఓటింగు నమోదు అవుతుండగా.. ఇదంతా మాత్రం తమ ప్రభుత్వానికి అనుకూలంగా పడిన ఓటింగు మాత్రమేనట! ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా.. మన రాష్ట్రంలో మాత్రం భారీ ఓటింగ్ అనేది ప్రభుత్వ అనుకూలతతోనే జరిగిందట.
సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో ఆద్యంతం బేలతనం, పలాయనవాదం కనిపించాయి. రేపు ఫలితాలు వెలువడిన తరువాత.. ఎలాంటి సాకులు చెప్పాలో వాటికి తగినట్టుగా ఆయన పోలింగ్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ లోనే రకరకాల విషయాలను అల్లి చెప్పుకొచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కు అయ్యారట. పోలీసులు అందరూ తెదేపా కూటమితో కుమ్మక్కు అయి పోలింగులో ఆద్యంతం వారికే సహకరించారట. పోలీసులు, ఈసీ తమ చెప్పుచేతల్లో ఉండడం కోసమే చంద్రబాబునాయుడు భాజపాతో పొత్తు పెట్టుకున్నారట. అలాగే ఒక పెద్ద కులం సపోర్టు కోసం పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారట. ఈసీని, పోలీసులను తెలుగుదేశం నాయకులు విపరీతంగా ప్రభావితం చేస్తే తొలినుంచి అన్నీ తమకు అనుకూల నిర్ణయాలు వచ్చేలా చేసుకున్నారట.
ఒకవైపు ఓటింగ్ మొత్తం ప్రభుత్వానికి అనుకూలంగా పడిందని అంటూనే.. ఇలాగే అన్ని ఓట్లూ తమకే పడ్డాయని చంద్రబాబు కూడా చెప్పుకోవచ్చునని, జూన్ 4 నాటికి అంతా తేలుతుందని సజ్జల అంటున్నారు. అయితే పోలింగ్ మొత్తం ఏకపక్షం అయిపోయిందని.. ఈసీ అబ్జర్వర్లు అందరూ కూటమికి అనుకూలంగా పనిచేయడం వల్లనే ఇలా జరిగిందట. ఒకవైపు పోలింగ్ ఏకపక్షం అయిందని, తెలుగుదేశం అధికారులు కుమ్మక్కు అయి నడిపించారని అంటే దాని అర్థం ఏమిటి? తెలుగుదేశం గెలవబోతున్నదని సజ్జల ఒప్పుకుంటున్నట్టే కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సజ్జల నిర్వహించిన ప్రెస్ మీట్ లో అధికార పార్టీకి తొత్తులుగా ఉన్న పోలీసుల బదిలీలపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతాకూడా పోలీసు వ్యవస్థ తెలుగుదేశంతో కుమ్మక్కుకావడానికి నిదర్శనమే అన్నారు. పరోక్షంగా ఓటమి ఒప్పుకున్నట్టే ఆయన మాటలున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles