విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కింగ్‌డమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి బజ్ ఉన్నప్పటికీ, తాజాగా కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ సినిమా జూలైలో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్లు మొదలవ్వాల్సిన టైమ్ లో కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి. సినిమా పూర్తయిన తర్వాత డైరెక్టర్ గౌతమ్ కొన్ని సన్నివేశాలు మళ్లీ చిత్రీకరిస్తున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో విడుదల మరింత ఆలస్యం అవుతుందా అనే సందేహాలు అభిమానుల్లో ఏర్పడ్డాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం, రూమర్స్ లో నిజం ఏమీ లేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ చాలా కాలమే పూర్తి అయ్యిందని, ప్రస్తుతం అన్ని సినిమాల్లో జరుగుతున్నట్టు కొన్ని చిన్నపాటి ప్యాచ్ వర్క్ మాత్రమే జరుగుతోందని తెలిసింది. ఈ పనులు కథానాయికల డబ్బింగ్, కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఫినిషింగ్ లాంటి భాగాల్లో భాగంగా ఉన్నట్టు సమాచారం.
కాబట్టి ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ నమ్మదగినవిగా లేవని స్పష్టంగా చెప్పొచ్చు. కింగ్‌డమ్ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఇప్పుడు నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి.
