పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా గురించి సినీ వర్గాల్లో మంచి బజ్ నెలకొంది. భీమ్లా నాయక్ తరువాత పవన్ మరోసారి పోలీస్ గెటప్‌లో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయింది.
తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా వెల్లడించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా చేసిన తాజా కామెంట్స్‌తో మరింత స్పష్టత వచ్చింది. ఈ నెల రెండో వారం నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందంటూ హరీష్ చెబుతుండగా, పవన్ కళ్యాణ్ మరోసారి సెట్స్ పై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొనగా, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.