కాంతారా 2 కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్న రిషబ్‌!

Tuesday, January 21, 2025

చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి వందల కోట్లు వసూలు చేసిన సినిమాల్లో కాంతారా ఒకటి. ఈ సినిమాకి రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా..హీరోగా కూడా నటించారు. ఈ సినిమాలో రిషబ్‌ తన నటనతో అందర్ని మెప్పించాడు.  కాంతారా సినిమా కన్నడ ప్రేక్షకులని మాత్రమే  తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది.  టాలీవుడ్‌లో కూడా మంచి సక్సెస్ అందుకునని భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కూ ప్రీ సీక్వెల్ ని తీస్తున్న విషయం తెలిసిందే.

ఎంతో మంది సినీ ప్రియులు కాంతారా2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈ మూవీ కోసం రిషబ్ శెట్టి చాలా కష్టపడుతున్నాడంట. దీని కోసం బాహుబలి రేంజ్‌లో కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ హీరో కాంతారా 2 షూటింగ్ కోసం 200×200 అడుగుల వైశాల్యంతో కుందాపుర ప్రపంచాన్ని, సెట్ రూపంలో పునః సృష్టి చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

అడవి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కోసం.. ఈ సెట్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం  600 మంది కార్పెంటర్లు పగలు రాత్రి తేడా లేకుండా  కష్టపడి పనిచేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. అలాగే రిషబ్ దీని కోసం చాలా సాహసం చేస్తున్నాడంట, కొత్త కొత్త విన్యాసాలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles