తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో “కూలీ” సినిమాపైనే ప్రస్తుతం ప్రేక్షకుల్లో పెద్ద స్థాయిలో ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తుండటమే కాదు, ఆయనకి సరికొత్త మాస్ షేడ్ లో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చూపించబోతున్నారన్న కారణంగా ఈ సినిమా చుట్టూ భారీగా హైప్ క్రియేట్ అయ్యింది.
ఈ సినిమా మీద దక్షిణాదిలోనే కాదు, ఇతర భాషల ఆడియన్స్ లోనూ మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా తమిళనాట రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేసిందని సమాచారం. రజినీ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎలాంటి డీల్స్ జరగలేవో అటువంటి రేంజ్ లో “కూలీ” ప్రీ రిలీజ్ మార్కెట్‌లో దూసుకెళ్లిందని టాక్.
తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి రేటే ఫిక్స్ అయిందట. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లోనూ ఈ సినిమా భారీ మొత్తానికి అమ్ముడైందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ దాదాపు 80 కోట్లకు పైగా అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇది ఒక తమిళ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన టాప్ లెవెల్ బిజినెస్ లోకే చేరుతుంది.
ఇంత పెద్ద స్థాయిలో బిజినెస్ చేసి, ఈ స్థాయిలో హైప్ సృష్టించిన “కూలీ” సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి దాకా ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ సినిమా విడుదలైన వెంటనే మరోసారి రజినీకాంత్ స్టామినా ఏంటో చూపిస్తాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నాయి.
