హీరో నితిన్ తాజా సినిమా ‘తమ్ముడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. జూలై 4న ఈ చిత్రం థియేటర్లలోకి grandగా రానుంది. ఈ సినిమాకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా, దీని కథలో యాక్షన్ సీన్స్‌తో పాటు గట్టిగా ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయట.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ కలిసి నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్లు సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చాయి. మినిమమ్ ప్రమోషన్‌తోనే decent హైప్ అందుకున్న ఈ సినిమాకు ముందుగా స్పెషల్ ప్రీమియర్ షోలు పెట్టే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని టాక్ వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఐడియాను పక్కనపెట్టినట్టు సమాచారం.
ప్రస్తుతం పెద్ద సినిమాల పోటీ ఏమీ లేకపోవడం వలన జూలై 4నే ఈ సినిమాను విడుదల చేయడం మంచి నిర్ణయమేనని ఫిలింనగర్ వర్గాల్లో కామెంట్లు వస్తున్నాయి.
కథలో నితిన్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలవని యూనిట్ నుంచి వినిపిస్తున్నది. ఈ చిత్రంలో నితిన్ సరసన లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన పాటలకు ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇలాంటి ఎమోషనల్ యాక్షన్ డ్రామాలు నితిన్ కెరీర్‌లో చాలా రేర్‌గా వస్తాయి కాబట్టి ఈ సినిమా ఫలితం పై మంచి ఆసక్తి నెలకొంది.